»   » రజనీకాంత్ డిస్ట్రబ్ అవుతారని... ఫ్యాన్స్ కోరిక చంపేస్తారా?

రజనీకాంత్ డిస్ట్రబ్ అవుతారని... ఫ్యాన్స్ కోరిక చంపేస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' జులై 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో పాటు తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఆడియోను జూన్ 12న భారీ వేడుక మధ్య రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అభిమానులు ఈ వేడుక కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎలాంటి వేడుక నిర్వహించకుండా ఆడియోను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రజనీకాంత్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్లో ఉండటమేనంట. చాలా రోజుల తర్వాత రజనీ అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వేకేషన్ వెళ్లారని, ఆడియో వేడుక పేరు ఆయన్ను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే నిర్మాతల నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. రజనీకాంత్ డిస్ట్రబ్ అవుతారని అభిమానుల కోరికను చంపుతారా? అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకుంటారో? లేదో?


ఈ గొడవ సంగతి పక్కన పెడితే...సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నెల రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తర్వాత ప్రతి ఒక్కరిలోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 23 మిలయన్ల కన్నా ఎక్కువ మందే వీక్షించారు. తెలుగు, తమిళంలో ఈ టీజర్ రిలీజ్ చేసారు. ఒక్క తమిళం టీజర్ కే 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగులో 3 మిలియన్లకుపైగా చూసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ టీజర్ కు ఈ రేంజిలో రెస్పాన్స్ రాలేదట. అందుకే దీన్ని వరల్డ్ రికార్డ్ అంటున్నారు అభిమానులు.


రెండు భిన్న పార్శ్వాలున్న పాత్ర

రెండు భిన్న పార్శ్వాలున్న పాత్ర

భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.


కబాలి

కబాలి

మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది.


నిజ జీవితకథ

నిజ జీవితకథ

పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నారు.


స్టోరీ

స్టోరీ

కబాలి కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.English summary
If sources are anything to go by, the plan for the audio launch of superstar Rajinikanth’s Kabali has been scrapped and the music will now directly hit the stores on June 12.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu