అరెస్ట్ వారెంట్: సూర్య, కట్టప్ప కోర్టుకు.. హీరోయిన్ల వ్యభిచారం వ్యవహారంలో..
తమిళ నటులు సూర్య, సత్యరాజ్‌లకు చుక్కెదురైంది. పరువునష్టం దావా కేసులో కోర్టు సూర్య, సత్యరాజ్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నటులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
తమిళ నటులు సూర్య, సత్యరాజ్‌లకు చుక్కెదురైంది. పరువునష్టం దావా కేసులో కోర్టు సూర్య, సత్యరాజ్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నటులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఊటీ జర్నలిస్టు సంఘం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నోటీసులను జారీ చేసినట్టు సమాచారం.
పరువు నష్టం దావా కేసులో తమిళ నటులు సూర్య, సత్యరాజ్ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరువునష్టం దావా కేసులో కోర్టు సూర్య, సత్యరాజ్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నటులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఊటీ జర్నలిస్టు సంఘం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హాజరుకాకపోవడంతో తమిళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులను కోర్టు జారీ చేసింది. ఓ తమిళ దినపత్రిక కథనంపై నిరసన వ్యక్తం చేస్తూ తమిళ చలన చిత్ర ప్రముఖులు జర్నలిస్టులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలపై జర్నలిస్టులు కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది.

తమిళ పత్రిక కథనం
2009లో తమిళ దిన పత్రిక దినమలార్ కొందరు హీరోయిన్లు వ్యభిచారం చేస్తున్నారని ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై తమిళ సినీ పరిశ్రమ నుంచి నిరసన, ఆగ్రహం వ్యక్తమైంది. తమిళ నటులందరూ కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళ నటులందరూ చేసిన ఆందోళన నేపథ్యంలో దినమలర్ ఎడిటర్ లెనిన్‌ను అప్పటి డీఎంకే ప్రభుత్వం అరెస్ట్ చేయించింది.

జర్నలిస్టులపై తీవ్రమైన పదజాలం
తమిళనటులు నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులకు వ్యతిరేకంగా కొందరు నటీనటులు తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రసంగాలు చేశారు. తమిళ నటులు వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. దాంతో తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఊటీ జర్నలిస్టులు తమిళ నటులపై కేసు నమోదు చేశారు.

ఎనిమిది మందిపై పరువు నష్టం..
ఆ ఘటనలో సూర్య, సత్యరాజ్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నటులపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణకు సూర్య, సత్యరాజ్, ఇతర నటులు గైర్హాజరు అయ్యారు. పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.

జూన్ 17కు వాయిదా
పలుమార్లు గైర్హాజరు అయిన నటులు తప్పకుండా విచారణకు హాజరుకావాలని కోర్టు నోటీసుల్లో స్పష్టం చేసింది. లేనియెడల కఠిన చర్యలు తీసుకోనేందుకు వెనుకాడబోమని పేర్కొన్నది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. ఈ విచారణకు తప్పకుండా హాజరుకావాలని సూచించింది.


Click it and Unblock the Notifications











