»   » ఊహించను కూడా లేరు: నయన తార ఖాళీ సమయాల్లో ఏం చేస్తుందో తెలుసా

ఊహించను కూడా లేరు: నయన తార ఖాళీ సమయాల్లో ఏం చేస్తుందో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న నయన తార తన గురించి కొత్త సంగతులు తెలిపింది. నయన్ కు కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పట్నుంచి తనకు ఈ హాబీ ఉందని.. ఇప్పటికే చాలా కవితలు రాశానని.. వివిధ అంశాలపై తాను పొయెట్రీ రాస్తుంటానని నయన్ వెల్లడించింది. తనకు ఎప్పుడు ఖాళీ దొరికినా.. పెన్నూ పేపరు పట్టి కవితలు రాయడం మొదలుపెడతానని ఆమె చెప్పింది.

కవితలు రాస్తానని ప్రకటించింది

కవితలు రాస్తానని ప్రకటించింది

అలాగే తాను కొత్త వంటలు చేయడం కూడా ప్రయత్నిస్తుంటానని నయన్ వెల్లడించింది. ఫ్రీ టైం దొరికితే కవితలు రాస్తానని ప్రకటించింది. ఇప్పటివరకు ఆమె కవితలు రాస్తుందనే విషయం చాలామందికి తెలీదు. నయనతార ప్రకటనతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

Nayanthara's 3 Conditions to Producers
అరమ్ అనే సినిమా చేస్తోంది

అరమ్ అనే సినిమా చేస్తోంది

వినగానే ఆమెకు ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని స్వయంగా నయన్ ప్రకటించడం విశేషం. కోలీవుడ్ లో అరమ్ అనే సినిమా చేస్తోంది నయనతార. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ రియాలిటీ షోకు హాజరైంది. అక్కడే ఈ విషయాలు చెప్పింది.

క్లారిటీ ఇవ్వలేదు

క్లారిటీ ఇవ్వలేదు

కవితలు రాయడంతో పాటు ఖాళీ దొరికితే కొత్త కొత్త వంటకాలు కూడా ట్రై చేస్తుంటానని ప్రకటించింది ఈ బ్యూటీ. వంటకాలు ట్రై చేయడం అందరూ చేసేదే. కానీ కవితలు రాయడం మాత్రం నిజంగా కొత్త విషయమే. మరి నయనతార తన కవితల్ని బయటపెడుతుందా, పుస్తక రూపంలోకి తీసుకొస్తుందా..? ఈ విషయాలపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటివరకు తన కవితల్ని ఎవరికీ చూపించలేదనే విషయం మాత్రం చెప్పింది.

బ్యూరోక్రాట్ పాత్ర

బ్యూరోక్రాట్ పాత్ర

సినిమాల్లో నటించడమే తప్ప.. ప్రమోషన్లకు వెళ్లడం అలవాటు లేని నయన్.. ఆశ్చర్యకరంగా ‘ఆరమ్' అనే సినిమాను ప్రమోట్ చేస్తోంది. రైతుల నీటి సమస్యపై పోరాడే ఓ బ్యూరోక్రాట్ పాత్రను చేస్తోంది నయన్ ఇందులో. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నయనకు ప్రత్యేకంగా రూ.40 లక్షల దాకా పారితోషకం ఇచ్చారట. దీంతో ఆమె టీవీ షోలకు వెళ్తూ.. మీడియా వాళ్లను కలుస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది.

English summary
Other Side of Nayanthara that she Writes Poetry., Nayan herself said that she writes Poetry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu