Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రజనీకాంత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన దర్శకుడు
రజనీకాంత్‌తో 'కబాలి' చిత్రం తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ దర్శకుడు పా రంజిత్ సూపర్ స్టార్ కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కాలా' మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది.
అయితే 'కాలా' మూవీ క్లైమాక్సులో కరికాలన్ బ్రతికే ఉన్నాడనే హింట్ ఇవ్వడంతో దీనికి సీక్వెల్ వస్తుందని రజనీ అభిమానులు భావించారు. అయితే 'కాలా'కు సీక్వెల్ తీసే ఉద్దేశ్యం లేదని పా రంజిత్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూర్‌లో గ్రంథాలయం, రాత్రి పాఠశాలను ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మీడియా వారు 'కాలా 2' గురించి రంజిత్‌ను ప్రశ్నించగా... ఆ సినిమాకు రెండో భాగం రూపొందించే అవకాశం లేదని తెలిపారు.
'కాలా' చిత్రంలో చూపించిన సామాజిక పరిస్థితులు నేపథ్యంలో మరిన్ని సినిమాలు తీస్తానని, కాలా 2 సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం పా రంజిత్ 'బిర్సా ముండా' అనే ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ జీవితంపై సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.