»   » హీరోయిన్ ‌ల పరిస్థితి మరీ ఘోరం: పద్మప్రియ

హీరోయిన్ ‌ల పరిస్థితి మరీ ఘోరం: పద్మప్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి హీరోయిన్స్ కు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించేవి. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. సినిమాలో పాట రాగానే హీరోయిన్ ప్రత్యక్షమవుతుంది. అందాలను తెరపై ఆరబోస్తుంది. పాట అయిపోగానే అంతర్థానమవుతుంది. నేటి హీరోయిన్‌ల పరిస్థితి ఇది. ఘోరం అంటూ చెప్పుకొచ్చింది పద్మ ప్రియ. అలాగే ఇలాంటి హీరోయిన్ పాత్రల్లో చేయడానికి డాన్స్‌ లో ప్రావీణ్యత, కాస్తంత అందం ఉంటే చాలు. నటనలో ప్రావీణ్యత అక్కర్లేదు. అందుకే నటనంటే ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన నేను ఇలాంటి పాత్రలకు దూరంగా ఉంటున్నాను అంటోంది. ఇక నాకు నటన అంటే ఇష్టం. నేను సినిమా రంగానికి రావడానికి కారణం అదే.కాబట్టి ఆలోచింపచేసే పాత్రలు వస్తేనే చేస్తాను. ఇప్పటిలాగానే నటిగా నా కెరీర్ ‌ని ఇలానే కొనసాగిస్తా. అందులో ఏ మాత్రం మార్పుండదు అని తెగేసి చెప్పిందామె. అందుకే పద్మప్రియకు అవార్డులు, రివార్డులు వస్తున్నాయి. అన్ని భాషల్లోనూ చేస్తోంది. రీసెంట్ గా అందరిబంధువయా చిత్రంలో పద్మప్రియ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రను చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu