twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిషపై పోలీసులకు ఫిర్యాదు

    By Srikanya
    |

    వేలూరు: సినీనటి త్రిషపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకేకు చెందిన న్యాయవాది జానకిరామన్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన రాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో.. గత 18న జరిగిన కార్యక్రమంలో 'యువతులు మద్యం తాగొచ్చా' అన్న విలేకర్ల ప్రశ్నకు త్రిష బదులిస్తూ మద్యం తాగటం అన్నది వారివారి ఇష్టం. తన విషయానికొస్తే సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో ఇష్టపడి నటిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు యువతను మద్యం తాగేలా పురికొల్పుతాయని, ఆమెపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

    ఆ మీడియా సమావేశంలో త్రిష మాట్లాడింది ఏమిటంటే..... ''నేను నటించే చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాలుంటే అవి తప్పకుండా విజయం సాధిస్తాయని నా స్నేహితులు చెప్పారు. అందుకే ప్రతి చిత్రంలో అలాంటివి ఉండాలని దర్శకులను అడుగుతాను. నా తరవాతి చిత్రాల్లోనూ అవకాశం ఉంటే అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తాను'' అని తెలిపింది. ఆ పార్టీ వారు ఆమెకు క్షమాపణ డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసారు. ఇలాంటి సెలబ్రేటీలు చేసే వ్యాఖ్యాలు హిందూ స్త్రీలపై ప్రభావం చూపిస్తాయని, స్త్రీల త్రాగుడుని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉందని వారు నిరసన వ్యక్తం చేసారు.

    ఇక త్రిష నేటి తరం యువతులు మద్యం సేవించడం మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే 'ఇలాంటి వివాదాస్పద ప్రశ్నకు సమాధానం చెప్పలేను' అంటూ సమాధానం దాటవేసింది.

    తొలుత నాకు 'వేటాడు వెంటాడు' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్‌ షేడ్స్‌ కనిపించాయి. ఆ స్క్రిప్ట్‌ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్‌ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.

    English summary
    Trisha has managed to stay out of controversies for a very long period in Tamil cinema. The actress is now in a fix as she has been accused of making statements supporting women who consume alcohol. In her recent film Samar, there is a scene that shows the actress consuming alcohol. Trisha had apparently made statements that support women consuming alcohol. This has not gone down well with a few sections of the society. Advocate Janakiraman has filed a case against the actress in Ranipettai police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X