»   » సంగత దర్శకుడు అనిరుధ్ ని అరెస్ట్ కు పోలీస్ లు

సంగత దర్శకుడు అనిరుధ్ ని అరెస్ట్ కు పోలీస్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సంగీత దర్శకుడు అనిరుధ్ ని అరెస్ట్ చేయటానికి చెన్నై పోలీస్ లు సిద్దమయ్యినట్లు సమాచారం. కెనడా వెళ్లిన అనిరుధ్ ని ఇండియాకు రాగనే ఎయిర్ పోర్ట్ దగ్గరే పట్టుకుని అరెస్ట్ చేయాటనికి మాటు వేస్తున్నట్లు చెన్నై ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' ప్రస్తుతం తమిళనాడులో పెద్ద సంచలనమైంది. మహిళలను కించపరిచే రీతిలో అసభ్య పదజాలంతో తమిళ సినీ నటుడు శింబు పాడిన బీప్ సాంగ్ వివాదం రాజు కుంది.

మహిళా సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు రేస్ కోర్సు పోలీసులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేశారు. ఈ విషయం వెల్లడైనప్పటి నుంచి నటుడు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Police planning to arrest Anirudh at Airport ?

మహిళలను కించపరిచే రీతిలో పాట పాడిన శింబు, అనిరుధ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘం, ప్రజాస్వామ్య యువత సంఘం తరపున సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను దగ్ధం చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. తర్వాత ఆందోళన కారులు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను చింపేసి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా పాటను రూపొందించిన వారిపై బెయిలుకు వీల్లేని కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

English summary
Sources says that the Chennai police have planned to arrest Beep song Anirudh at Chennai Airport, when he return from Canada.
Please Wait while comments are loading...