»   » షాక్: రజనీకాంత్ మీద సెటైర్లు వేయబోతున్న పవర్ స్టార్

షాక్: రజనీకాంత్ మీద సెటైర్లు వేయబోతున్న పవర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ అంటే మన తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. ఈయన తమిళ పవర్ స్టార్ లెండి. తమిళ నటుడు శ్రీనివాసన్ తనకు తానుగా ‘పవర్ స్టార్' అనే బిరుదు తగిలించుకుని తమిళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా నానా మంగామా చేస్తున్నాడు. ఇతని చేష్టలు ఇతర హీరోల అభిమానులకు ఇరిటేట్ కలిగించే విధంగా ఉంటాయి. త్వరలో ఈ పవర్ స్టార్ ‘లతిక' అనే సినిమా చేస్తున్నాడు. దర్శకత్వం వహించేది కూడా అతగాడే.

తనకు ఇతర దర్శకుల సినిమాల్లో నటించే సమయం లేదని... తమిళ సినీ పరిశ్రమలో నెక్ట్స్ సూపర్ స్టార్ కావాలన్నదే తన ఇంటెన్షన్ అని చెప్పుకుంటున్నాడు. ఇతగాడు తన తర్వాతి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇమిటేట్ చేయబోతున్నాడు.

Powerstar All Set To Make Fun Of Rajinikanth's Lingaa In His Next Film

ఇటీవల రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘లింగా' చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విషయాలను తన సినిమాలో చూపించబోతున్నారట. ఏకంగా రజనీకాంత్ మీదనే సెటైర్లు వేయడం తమిళ సీనీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

శ్రీనివాసన్ వ్యవహారం రజనీకాంత్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. త్వరలోనే అతను తాను అనుకున్న విషయాలతో సినిమా తెరక్కించబోతున్నాడు. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో? రజనీకాంత్ మీద సెటైర్లు ఎలా ఉండబోతున్నాయో?

English summary
From the day Srinivasan roped in himself in the film titled Lathika, which was directed by him, the man has made leaps and bounds in Tamil cinema, which might actually irritate others to some extent.
Please Wait while comments are loading...