»   » కంగ్రాట్స్ :మొన్న కొరటాలకి ఇప్పుడు ఈ డైరక్టర్ కి ఆడీ కారు గిప్ట్

కంగ్రాట్స్ :మొన్న కొరటాలకి ఇప్పుడు ఈ డైరక్టర్ కి ఆడీ కారు గిప్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ మద్యకాలంలో తమకు హిట్ ఇచ్చిన డైరక్టర్స్ కు నిర్మాతలు లేదా హీరోలు సినిమా రిలీజ్ అయ్యాక ...గిప్ట్ లు ఇవ్వటం ఆనవాయితీగా మారింది. ఆ మధ్యన శ్రీమంతుడు హిట్ సమయంలో దర్శకుడు కొరటాల శివకు...మహేష్ బాబు ఓ కారుని గిప్ట్ గా ఇచ్చిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవకాసం తమిళ దర్శకుడు ఎ ఎల్ విజయ్ ని వరించింది.

దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ ప్రేక్షకుల హృదయాలనే కాదు నిర్మాతల హృదయాలనూ దోచుకున్నారు. ఇలా అనడానికి కారణం లేకపోలేదు.. ఎ.ఎల్‌.విజయ్‌కు నిర్మాత ఐసరి కె గణేశ్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కలిసి ఆడీ కారును బహుమతిగా ఇచ్చారట. 'దేవి' చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.'కష్టం ఫలితాన్ని ఇస్తుంది! ప్రభుదేవా, కె.గణేశ్‌ కలిసి కారును బహూకరించిన 'దేవి' దర్శకుడు విజయ్‌కి శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేసింది.ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దేవి'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అభినేత్రి', తమిళంలో 'దేవి', హిందీలో 'టుటక్‌ టుటక్‌ టుటియా' టైటిల్స్‌తో విడుదల చేశారు.


'అభినేత్రి' రివ్యూ ఇక్కడ చదవండి


హారర్ తక్కువైనా కామెడీ వర్కౌట్ అయింది ('అభినేత్రి' రివ్యూ)


ప్రభుదేవా తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమైంది. హిందీలోనే పలు చిత్రాలు చేస్తున్న అతను ఉన్నట్టుండి 'అభినేత్రి' అనే సినిమాను చేస్తున్నాడనీ, దానికి నిర్మాతనే తనే అనే చెప్పడంతో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. దానికితోడు తమన్నా అతనికి భార్యగా నటించటం అనేది మరో విశేషం అయ్యింది. మరో నటుడు సోనూసూద్‌ కూడా ఉండటంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. సోనూసూద్‌తోనే తమన్నా ఉన్న సన్నివేశాలు పబ్లిసిటీకి ఉపయోగించారు.


English summary
Director A L Vijay seems to have won the hearts of not just his audiences but also the producers of his last film Devi(L). Pleased with the film, the producers Isari K Ganesh and actor-director Prabhu Deva, who incidentally also played the lead in the film, chose to gift the soft-spoken director an Audi car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu