»   » విదేశీ గడ్డపై ప్రభుదేవా హవా.. ఫారిన్ ఫెస్టివల్‌కు మెర్క్యూరీ మూవీ

విదేశీ గడ్డపై ప్రభుదేవా హవా.. ఫారిన్ ఫెస్టివల్‌కు మెర్క్యూరీ మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన మూకీ సినిమా ''మెర్క్యూరీ'' ప్రతిష్టాత్మక ''ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్'' లో ప్రదర్శింపబడనుంది. పిజ్జా, జిగర్తాండా, ఐరవి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ ఇది.. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతున్న ఈ సైలెంట్ థ్రిల్లర్ మూవీ ''ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్'' లో ఏప్రిల్ 12న ప్రీమియర్ జరుపుకోనుంది.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ- మా చిత్రం ప్రతిష్టాత్మక ''ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్'' 16వ ఎడిషన్ కు ఏంట్రీ పొందడం చాలా ఆనందంగా ఉంది. లాస్ ఏంజిల్స్ ఉన్న సినీ అభిమానులందరికీ మా సినిమా అక్కడ చూసేందుకు ఇదొ మంచి వేదిక.

Prabhu Deva starrer Mercury makes an entry into Indian Film Festival Los Angeles

ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మా మూవీ అందరికీ ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది.'' అన్నారు. పెన్ స్టూడియోస్ మరియు స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పిస్తున్న ''మెర్క్యూరీ'' ని కార్తీకేయన్ సంతానం, జయంతి లాల్ సంయుక్తంగా నిర్మించారు..

నటీనటులు: ప్రభుదేవా, సనంత్, ఇందూజ, దీపక్ పరమేష్, శశాంక్ పురుషోత్తమ్, అనీష్, పద్మనాభన్
నిర్మాతలు: కార్తీకేయన్ సంతానం & జయంతి లాల్ , స్టోరీ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

English summary
Karthik Subbaraj’s next outing Mercury, a silent thriller starring Prabhu Deva in a lead role has made an official entry into the Indian Film Festival Of Los Angeles. Karthik is elated about his film being selected for this festival. He says, “I am extremely honoured that our film Mercury has made it to Indian Film Festival Of Los Angeles. It is an extremely prestigious film festival which is being organised and is in it's 16th edition now. Our film premieres’ on 12th April. I think its a great platform for moviegoers in LA to experience our cinema.“
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X