twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jai Bhim చెంపదెబ్బ వివాదం.. సీన్ కాదు.. నేనే వారి ఎజెండా.. ఘాటుగా స్పందించిన ప్రకాశ్ రాజ్

    |

    హీరో సూర్య నటుడిగా కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం జై భీమ్. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కనిపించిన ఓ సన్నివేశం వివాదాస్పదంగా మారింది. కథలో భాగంగా ఓ సన్నివేశంలో హిందీ మాట్లాడిన ఓ వ్యక్తిని ప్రకాశ్ రాజ్ చెంపదెబ్బ కొడుతాడు. ఈ సన్నివేశంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్న ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు.

    ఆ సీన్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు

    ఆ సీన్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు

    జై భీమ్ సినిమాలో హిందీ మాట్లాడే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన సీన్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ సీన్‌ను వివాదంగా మార్చాలని ఎజెండాగా పెట్టుకొన్న వాళ్లు సృష్టిస్తున్న సమస్య అది అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌కు సమాజంలోని కొన్ని వర్గాలు అండగా నిలువడం విశేషంగా చెప్పుకోవచ్చు.

     అనసవసరమైన రాద్దాంతం చేస్తూ

    అనసవసరమైన రాద్దాంతం చేస్తూ

    చెంపదెబ్బ వివాదంపై స్పందిస్తూ.. జై భీమ్ లాంటి సినిమాను చూసిన తర్వాత అందులోని గిరిజన ప్రజల బాధల గురించి చూడకుండా, వారికి జరిగిన అన్యాయంపై స్పందించకుండా.. అనవసరంగా ఇలాంటి సీన్లపై రాద్దాంతం చేస్తున్నారు. అది వారి ఎజెండాలో భాగంగానే జరుగుతున్నది అని ప్రకాశ్ రాజ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నంలో దక్షిణాది ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. జైభీమ్ సన్నివేశంలో ఓ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి ఓ వ్యక్తిని ప్రశ్నించే క్రమంలో హిందీలో సమాధానం ఇస్తాడు. కానీ ఆ వ్యక్తికి స్థానిక భాష తెలిసినా కూడా హిందిలో మాట్లాడటం, సమాధానం చెప్పడం వల్ల ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్రకు కోపం వస్తుంది. ఆ క్రమంలో ఆ వ్యక్తిని పోలీస్ అధికారి చెంప దెబ్బ కొడుతాడు అని ప్రకాశ్ రాజ్ వివరించారు.

     ప్రకాశ్ రాజ్ అసలు సమస్య అంటూ

    ప్రకాశ్ రాజ్ అసలు సమస్య అంటూ

    ఇలాంటి వివాదాలపై స్పందించడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆ పాత్రలో ప్రకాశ్ రాజ్ ఉండి..చెంప దెబ్బ కొట్టడం అసలు వివాదంగా మార్చుతున్నారు. అంతేగానీ ఆ సీన్ గురించి వారికి అభ్యంతరం లేదు. కేవలం ప్రకాశ్ రాజ్ మీద ఉన్న ద్వేషం కారణంగానే ఇలాంటి వివాదాలను తెరపైకి తెస్తున్నారు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    Recommended Video

    Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
    తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనతో

    తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనతో

    90వ దశకంలో తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు కథగా మలిచి దర్శకుడు తా సే జానవేల్ జై బీమ్ చిత్రాన్ని రూపొందించారు. నవంబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీగా ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమాను సూర్య, జ్యోతిక 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందించారు.

    English summary
    Versatile actor Prakash Raj reacted heavily on Slap scene in Jai Bhim movie. He said, After watching a film like Jai Bhim, they did not see strength of the movie, but they saw only the slap.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X