For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానా గర్ల్ ప్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దది: ప్రియా ఆనంద్‌

  By Srikanya
  |

  చెన్నై: దగ్గుపాటి రానా నాకు మంచి స్నేహితుడు. ఏకవచనంతో కూడా పిలుస్తా. త్రిషతో పెళ్లెప్పుడని అడుగుతున్నారు. అంతటి విషయాలు నాకు తెలియవు. అతనికి చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. అదో పెద్ద జాబితా అంటోంది ప్రియా ఆనంద్. దగ్గుపాటి రానా లీడర్ తో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్‌. అనంతరం 180 లతో సినీజనాలను అలరించింది. ఆ తర్వాత తెలుగులలో కనిపించలేదు. తాజాగా శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'లో అల్లరి అమ్మాయిగా మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌ ప్రధానపాత్రధారిగా వస్తున్న ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

  సిద్థార్థతో ప్రేమాయణమంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ... మేం నటించిన సినిమా వచ్చినప్పుడల్లా లేనిది.. ఇప్పుడు ఏకంగా వరసలు కలిపేస్తున్నారు. సినిమా వచ్చి సంవత్సరం దాటింది. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అందుకే ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు పుడుతున్నాయి. సమాధానం చెప్పలేకపోతున్నాను. అసలు ఈ విషయాన్ని లేవనెత్తిన వ్యక్తి ఎవరో కనిపెట్టి.. అతని వద్దే పూర్తి కథ తెలుసుకోండి అంటూ షార్ప్ గా సమాధానమిచ్చింది.

  ఇక బాలీవుడ్‌లో తన ఎంట్రీ గురించి చెప్తూ... పరిశ్రమలోకి ఎవరి సిఫారసు లేకుండా అడుగుపెట్టాను. నేను నటించిన పాత్ర కోసం బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, లాస్‌ ఏంజెల్స్‌ తదితర ప్రాంతాల్లో ఆడిషన్స్‌ జరిపారు. చివరిగా నన్ను ఎంపిక చేశారు. ఒకప్పుడు బాలీవుడ్‌ నుంచి తమిళనాడుకు హీరోయిన్స్ వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ శాసిస్తున్నారు. ఇక చిన్న వయసు నుంచే శ్రీదేవికి పెద్ద అభిమానిని. ఆమెకు చాలా లేఖలు, పెయింటింగ్స్‌ పంపాను. అలాంటి అభిమాన తారతో కనిపించడం నిజంగానే అదృష్టం. సినిమాలో నటించేందుకు చాలా సహకరించారు. వ్యక్తిగతంగానూ సలహాలు ఇచ్చారు అంది.

  రజనీకాంత్‌ తో నటించటమే తన ఆశయమని చెపుతూ... వద్దని చెప్పినా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరే చెబుతా. ఆయనతో ఒక్క దృశ్యంలో కనిపించినా సంతోషమే. 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'ను రజనీకాంత్‌ పక్కన కూర్చుని చూశాను. చాలా ఎంజాయ్‌ చేశా. వెళ్తూ.. వెళ్తూ నన్ను అభినందించారు. నా జీవితంలో చాలా సంతోషకరమైనరోజదే అన్నారు. అలాగే తన జీవితంలో సినిమాలో నన్ను ఎలా చూస్తున్నారో.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటా. అల్లరి ఏమాత్రం తగ్గదు. నవ్వుతూ.. ఇతరులనునవ్వించాలనుకుంటా అన్నారు.

  English summary
  There were reports in few sections of the media that Siddharth and Priya Anand, the'180' pair, are in a relationship. However, the actress has denied it. "I haven't seen Siddharth for the past few months. We worked together in '180' and he is a good friend of mine," says the 'Leadar' actress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X