»   » రజనీ 'కోచ్చడయాన్‌' పై దారుణమైన రూమర్

రజనీ 'కోచ్చడయాన్‌' పై దారుణమైన రూమర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కోచ్చడయాన్‌'. ఆయన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. దీపికా పదుకొనే హీరోయిన్. ఆ మధ్య ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ లుక్ ని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్ ద్వారా రివిల్ చేసారు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం ఇక రిలీజ్ కాదని,ఆగిపోయినట్లేనని రూమర్స్ వచ్చి మీడియాలో విపరీతమైన ప్రచారం పొందాయి. దాంతో నిర్మాతలు వివరణ ఇచ్చారు.

ఈ చిత్రం ఆగిపోయిదంటూ కోలీవుడ్ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై రజనీకాంత్, సౌందర్య ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ నిర్మాత మురళీ మనోహర్ మాత్రం ఖండించారు. కోచ్చడయాన్ చిత్రం ప్రమోషన్ ఆలోచనలో పడి ఇలాంటి అసత్య ప్రచారాన్ని పట్టించుకోలేదని, దారుణమైన రూమర్ అని వివరించారు. ఈ చిత్రానికి సంబంధించి కొంత పని మిగిలివుందన్నారు.

ఇది పూర్తయిన తర్వాత ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం కొంచెం వైవిధ్యంగా ఉండాలని ఆశిస్తున్నందున జాప్యం జరుగుతోందని అన్నా రు. దీన్ని రజనీకాంత్ అభిమానులు అర్థం చేసుకుని ఒక మంచి చిత్రం కోసం వేచి ఉంటారని నమ్ముతున్నట్లు మురళీమనోహర్ పేర్కొన్నారు.

ఇక ఈ చిత్రం 'కోచ్చడయాన్‌' అనే యోధుడు కథ ని తెలుపుతుంది. ఈ చిత్రంలో రజనీ...ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది వందశాతం రజనీ ఫార్ములా చిత్రం అని చెప్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఆయన కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే... ఇందలో ఇద్దరు రజనీలు ఉంటారు. ఇందులో సీనియర్‌ రజనీయే 'కోచ్చడయాన్‌'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్‌ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్‌ భరతనాట్య కళాకారుడు కూడా.

యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించాం. అప్పుడు మా అందరికీ తోచిన పేరు శోభన. అలాగే...ఇందులో తండ్రి 'కోచ్చడయాన్‌'.. కుమారుడు 'రాణా'. తండ్రిని మించిన తనయుడు. తండ్రితో పోల్చితే వందరెట్లు వేగంగా దూసుకుపోయే వ్యక్తి. రజనీకాంత్‌ అభిమానిగా చెబుతున్నా.. కచ్చితంగా వందశాతం కమర్షియల్‌ హంగులు ఇందులో ఉన్నాయి. ఇదివరకు నాన్న పోషించని పాత్ర ఇది. అభిమానులు ఎదురుచూసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఓ సన్నివేశంలో ఠీవీగా, స్త్టెల్‌గా ఓ పంచ్‌ డైలాగు చెప్పి.. ఇంకాస్త స్త్టెల్‌గా నడిచివెళ్తుంటారు.. ఆ సన్నివేశాన్ని చూసి యూనిట్‌ మొత్తం క్లాప్‌ కొట్టింది.

English summary
Replying to rumours doing rounds in certain sections of the press that superstar Rajinikanth’s upcoming 3-D animation venture Kochadaiyaan has been dropped, the producer of the film has dismissed all those rumours as ‘baseless’. For the past few days, some sections of the print media and a news which claimed that Kochadaiyaan might not release at all. These were disturbing to Rajini’s millions of fans who had been waiting ever-so-patiently to watch their Thalaivar in action on screen, albeit in an animation film, after a long time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu