‘అట్టర్ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్ముకున్నా.. ఆ హీరో అత్యంత దారుణంగా’

సినీ పరిశ్రమ చిత్ర విచిత్రమైనది.. ఇక్కడ ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫట్ అంటుందో ఎవరికీ తెలియదు. భారీ స్టార్ క్యాస్టింగ్, భారీ అంచనాలతో థియేటర్లలో దిగే సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తాయి. హీరోలు ఛరిష్మా, స్టార్‌డమ్‌లు కోట్లు కురిపిస్తాయని నమ్మి.. డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టి తర్వాత బొమ్మ రివర్స్ కావడంతో అడ్రస్ లేకుండా పోయిన నిర్మాతలు ఎందరో ఉన్నారు.

భారీ బడ్జెట్‌తో మునుగుతోన్న నిర్మాతలు
సినిమా ఫ్లాప్ అయితే నష్టపోయేది నిర్మాతే. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర నటీనటులు మరో సినిమా చేసుకుంటారు. కానీ నిర్మాతలు సినిమా తీయాలనే లక్ష్యంతో ఆస్తులన్నీ అమ్మి, అందినకాడికి అప్పులు చేసి సినిమాలు ఫ్లాప్ కావడంతో నిండా మునిగిపోతున్నారు. హీరోల రెమ్యునరేషన్లు తారా స్థాయికి చేరుతుండగా.. ప్రొడక్షన్ కాస్ట్‌లు పెరుగుతున్న దశలో నిర్మాతలు నెగ్గుకు రావడం కష్టంగా మారింది. ఎవరో ఒకరిద్దరు నిర్మాతలు తప్పించి.. చాలా మంది ప్రొడ్యూసర్లు తీవ్ర ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

Producer PT Selvakumar makes shocking Comments on Thalapathy Vijay over Puli movie result

నిర్మాతలకు అండగా నిలిచిన సూపర్‌స్టార్ కృష్ణ
సినీ పరిశ్రమలో నిర్మాతగా నిలదొక్కుకోవాలనే ఆశతో జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును ఎంతో మంది కోల్పోతున్నారు. ఒకప్పుడు నిర్మాతలు నష్టపోతే సూపర్‌స్టార్ కృష్ణ వంటి హీరోలు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయడం, ఫ్రీగా సినిమాలు చేసి వారిని ఆదుకునేవారు. ఈ తరంలోనూ రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ నిర్మాతల క్షేమం కోసం ఆలోచిస్తున్నారు. అయితే అందరికీ అలాంటి మనసు ఉండకపోవచ్చు, చేయాలని ఉన్నా కొన్ని పరిస్ధితులు వారి చేతులు కట్టేస్తూ ఉండొచ్చు.

అట్టర్ ఫ్లాపైన పులి
ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత పీటీ సెల్వకుమార్. విజయ్‌తో ఈయన 2015లో పులి అనే సినిమాను చేశారు. దివంగత శ్రీదేవి, ప్రభు, కిచ్చా సుదీప్, శృతిహాసన్, హన్సిక మోత్వానీ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో చింబు దేవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా.. 100 కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే రాబట్టింది. సోషియో ఫాంటసీ, జానపదాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా విజయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత సెల్వ కుమార్‌కు భారీ నష్టాలు వచ్చి.. ఆ తర్వాత కోలుకోలేక సినిమా నిర్మాణానికి దూరమయ్యారు.

సన్నిహితులే ముంచారు
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెల్వకుమార్.. పులి ఫ్లాప్, విజయ్ మనస్తత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 27 ఏళ్ల పాటు నేను సంపాదించిన కష్టార్జితంతో పులిని తీసి ఎన్నో కష్టాలు పడి రిలీజ్ చేశాం.. రిలీజ్‌కు 24 గంటల ముందు తన ఇంటిపై ఐటీ రైడ్ జరిగిందని, ఇది సన్నిహితుల పనేనని సెల్వకుమార్ ఆరోపించారు. పులిపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం జరిగిందని, నెగిటివ్ రివ్యూలు దెబ్బతీయగా.. విజయ్ అభిమానులు సైతం థియేటర్స్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ హీరో ఇంటికి రానివ్వలేదు
పులి ఫ్లాప్ కావడంతో తాను ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని.. ఇంత కష్టంలోనూ విజయ్ నుంచి కనీసం తనకు ఓదార్పు లేదని నా స్థానంలో మరొకరంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవాళ్లని సెల్వకుమార్ వాపోయారు. పులి ఫ్లాప్ అయినా విజయ్ కెరీర్‌కు ఏమాత్రం డామేజి కాలేదని ఆయన రెమ్యునరేషన్ డబుల్ అయ్యిందని.. నేను మాత్రం ఒక ఫెయిల్యూర్‌గా మిగిలిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న దశలో ప్రస్తుతం సెల్వకుమార్ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో, కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X