వడివేలుపై పోలీసులకు నిర్మాతల ఫిర్యాదు.. పీకల్లోతు కష్టాల్లో కమెడియన్

By Rajababu

Recommended Video

Complaint Filed Against Popular Comedian

ప్రముఖ హాస్యనటుడు వడివేలు సినీ కెరీర్‌లో హింసించే 23వ రాజు పులకేసి మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత హింసించే 24వ పులకేసి రూపొందించింది. ఈ చిత్రం షూటింగ్ విషయంలో తమను ఇబ్బందికి గురిచేశాడని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది

24వ పులకేసి, వడివేలు వివాదం

24వ పులకేసి, వడివేలు వివాదం

గతేడాది 23వ రాజు పులకేసి చిత్రానికి సీక్వెల్‌గా హింసించే 24వ రాజు పులకేసి ప్రారంభించారు. ఆ చిత్రానికి కూడా దర్శకుడు శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. వడివేలు సహకరించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.

సహకరించని హాస్యనటుడు వడివేలు

సహకరించని హాస్యనటుడు వడివేలు

హింసించే 24వ రాజు పులకేసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని వడివేలును కోరారు. పలుమార్లు కోరిన పిదప కూడా ఫలితం లేకపోయింది. ఆ నేపథ్యంలో వడివేలుపై చర్యలు తీసుకోవడానికి నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 వడివేలుపై ఫిర్యాదు చేసినా..

వడివేలుపై ఫిర్యాదు చేసినా..

పోలీసులను సంప్రదించడానికి ముందు తమిళనాడు నిర్మాతల మండలిలో పులకేసి నిర్మాతలు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.

 వివాదానికి కారణం ఇదే

వివాదానికి కారణం ఇదే

ఈ చిత్రంలో వడివేలుకు పనిచేసే స్టైలిష్ట్ విషయంపై వివాదం నెలకొన్నది. తనకు నచ్చిన స్టైలిస్ట్‌ను ఇవ్వాలని, లేదా తెచ్చుకొంటానని సూచించడంతో నిర్మాతలు నిరాకరించారు. దాంతో నిర్మాతలకు, వడివేలుకు మధ్య రిలేషన్లు చెడిపోయాయి.

 తీవ్ర నష్టాల్లో నిర్మాతలు

తీవ్ర నష్టాల్లో నిర్మాతలు

వడివేలు సహకరించకపోవడం వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. నిర్మాతలు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. దాంతో చేసేది ఏమీలేక వడివేలుపై చర్యలకు పూనుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X