»   » సీన్స్ తొలిగించపోతే పోరాటమే

సీన్స్ తొలిగించపోతే పోరాటమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: విశాల్‌, కేథరిన్‌ జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌, పాండిరాజ్‌ నిర్మించిన చిత్రం 'కథకళి'. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ కురిపిస్తోంది. అయితే అనుకోని విధంగా ఈ చిత్రం వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలో క్షురకులను కించపరిచేలా చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాలని క్షురకుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నటేశన్ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు నటేశన్ విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది.. ఈ మధ్యన విడుదలైన విశాల్‌ నటించిన ‘కథకళి' సినిమాలో వెంట్రుకలు కత్తిరించే వారు అదే పనిలో వుండాలని విలన్ చెప్పే డైలాగ్‌ క్షురకుల మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయన్నారు.

క్షురకులు కూడా మనుషులేనని, వారు ఉన్నత స్థితిలోకి రాకుండా వుం డాలన్నదే వారి ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఆ సన్నివేశాలను తొలగించకుంటే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Protest against Vishal's Kathakali

తెలుగు రిలీజ్ విషయానికి వస్తే..

తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి అదే పేరుతో ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రాన్ని ఈ వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ సరైన థియోటర్స్ దొరక్కే వాయిదా వేసారని హీరో విశాల్ చెప్తున్నారు.

నిజానికి తెలుగు, తమిళంలో ఒకేరోజు ఈ సినిమా రిలీజ్‌ చేయాల్సింది కాని తమిళంలో దొరికినన్ని థియేటర్లు తెలుగులో దొరకలేదు. స్ట్రెయిట్‌ సినిమాలు చాలా రిలీజ్‌ అయ్యాయి. సో.. మంచి డేట్‌ కోసం ఎదురు చూసి ఈనెలలోనే రిలీజ్‌ చేయాలనుకున్నాం అంటున్నారు విశాల్.

విశాల్‌ మాట్లాడుతూ.. '' తమిళంలో సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా అదే టైటిల్‌తో ఈనెలలోనే ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్‌ జరుగుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. కథకు కథకళి టైటిల్‌ సరిపోతుందని ఎంపిక చేశాం. నేషనల్‌ అవార్డు విన్నర్‌ పాండిరాజ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు అన్నారు.

డైరెక్టర్‌ స్నేహితునికి జరిగిన రెండు సంఘటనలను ఆధారంగా చేసుకొని కథ రాశారు. ఇదొక మర్డర్‌ మిస్టరీ. చెన్నైలో మొదలయ్యి కడలూరులో పూర్తయ్యే కథ. ఒక రోజులో జరిగే కథ. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. మర్డర్‌ ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక నవల చదువుతున్న భావన కలుగుతుంది.

పాండిరాజ్‌ మాట్లాడుతూ.. తమిళంలో చేసిన 'పసంగ2', 'కథకళి' చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి రిలీజ్‌ అయ్యి విజయాన్ని సాధించాయి. అలానే తెలుగులో కూడా కథకళి, మేము.. చిత్రాలు వరుసగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి సక్సెస్‌ ను సాదిస్తాయనే నమ్మకం ఉంది. నా డైరెక్షన్‌లో మొదటిసారిగా వస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది'' అని చెప్పారు.

హీరోయిన్ కేథరిన్‌ తెరీసా మాట్లాడుతూ.. తమిళంలో 'మద్రాసు' తరువాత ఈ సినిమాలో నటించాను. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్‌ కావాలి'' అని చెప్పారు.

English summary
Condemning the controversial scenes in Kathakali film, Barbers welfare association is planning a protest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu