»   » నాగార్జున కొత్త చిత్రం...చెన్నైలో లాంచ్ (ఫొటోలు)

నాగార్జున కొత్త చిత్రం...చెన్నైలో లాంచ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : పీవీపీ నిర్మాణంలో తెరకెక్కుతున్న'ప్రొడక్షన్‌ 9' చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలోని ఏవీఎంలో జరిగింది. అక్కినేని నాగార్జున, కార్తి మల్టీస్టారర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కు సంబంధించి ఏవీఎంలోని వినాయక ఆలయంలో ప్రారంభోత్సవం జరిగింది. కార్తీకి సంబంధించిన సన్నివేశానికి ఆయన తండ్రి, నటుడు శివకుమార్‌ క్లాప్‌ కొట్టారు. కార్యక్రమంలో వంశీ పైడిపల్లి, శివకుమార్‌, కార్తి, నటి జయసుధ, మనోబాల తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ' ప్రతి ప్రేక్షకుడి మనస్సు హత్తుకునే చిత్రమిది. ఇందులో రక్తసంబంధానికి మించిన ఆత్మీయులుగా నాగార్జున, కార్తి నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ చెన్నైలోనే జరుగనుంది. తర్వాత యూరప్‌లో చిత్రీకరిస్తాం. కార్తీకి జంటగా శ్రుతిహాసన్‌ ఆడిపాడనుంది. నాగార్జున జోడీ గురించి త్వరలోనే చెబుతాము''అని పేర్కొన్నారు.

స్లైడ్ షోలో... ఫొటోలు ...

కొత్త మల్టీ స్టారర్..

కొత్త మల్టీ స్టారర్..

ఒక భారీ చిత్రంలో తెలుగు స్టార్, తమిళ స్టార్ కలిసి నటించడం విశేషం. అలాంటి క్రేజి కాంబినేషన్ నాగార్జున, కార్తీలతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ఇది.

తెలుగు దర్సకుడు,తమిళ హీరో

తెలుగు దర్సకుడు,తమిళ హీరో

రీసెంట్ గా ఎవడు వంటి హిట్ కొట్టిన దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పివిపి సినిమా పతాకంపై పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఆ క్రేజే వేరు

ఆ క్రేజే వేరు

ఈ కాంబినేషన్‌కు నటి శ్రుతిహాసన్ జోడైతే ఆ క్రేజ్ వేరు. అలాంటి పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం ఆదివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ముఖ్య అతిథిగా...

ముఖ్య అతిథిగా...

స్థానిక ఎవిఎం స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జయసుధ సైతం...

జయసుధ సైతం...

నటి జయసుధ, దర్శకుడు వంవీ పైడిపల్లి పివిపి నిర్వాహకులు పాల్గొన్నారు.

కార్తీ మాట్లాడుతూ

కార్తీ మాట్లాడుతూ

నాగార్జునతో నటించడానికి చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చిత్ర కథ, తన పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు చెప్పారు.

దర్శకుడు వంశి పైడిపల్లి మాట్లాడుతూ...

దర్శకుడు వంశి పైడిపల్లి మాట్లాడుతూ...

ఈ కథను నాగార్జునను దృష్టిలో పెట్టుకునే రాసినట్లు చెప్పారు. మరో హీరో పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ వచ్చినప్పుడు తన ఆలోచనలో కొచ్చిన నటుడు కార్తీ అని పేర్కొన్నారు.

 యూనిట్ సైతం..

యూనిట్ సైతం..

చిత్ర యూనిట్ కూడా ఆయనే కరెక్ట్ అన్న నిర్ణయానికి రావడంతో కార్తీకి కథ చెప్పగా బాగుంది చేద్దాం అని అన్నారని వంశీ పైడిపల్లి చెప్పారు.

ఈ రోజు నుంచే..

ఈ రోజు నుంచే..

సోమవారం నుంచి చెన్నైలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

విదేశాల్లో...

విదేశాల్లో...


తదుపరి 40 రోజుల పాటు విదేశాల్లో చిత్రీకరించి ఆపై హైదరాబాద్‌లో షూటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కార్తీ సరసన..

కార్తీ సరసన..

కార్తీ సరసన నటి శ్రుతిహాసన్, ఆయన తల్లిగా జయసుధ నటించనున్నారని చెప్పారు.

సస్పెన్స్...

సస్పెన్స్...

నాగార్జున సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని దర్శకుడు అన్నారు.

సంగీతం..

సంగీతం..

ఈ చిత్రానికి మళయ చిత్రం వస్తాద్ ఫేమ్ గోపిసుందర్ సంగీతం ఇస్తున్నారు.

కెమెరా...

కెమెరా...

బెంగుళూరు డేస్ చిత్రం ఫేమ్ పి ఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

English summary
PVP Cinema launched their Production number 9 in a simple but elegant manner. Starring Nagarjuna and Karthi two stars who can make the South Indian market challenge their national counter parts, this action flick is termed as one of the most expected films of the year 2015.
Please Wait while comments are loading...