»   » కళ్యాణ్ రామ్ ‘పటాస్’ తమిళ రీమేక్ ట్రైలర్ ఇదిగో, లారెన్స్ దుమ్ము రేపాడు (వీడియో)

కళ్యాణ్ రామ్ ‘పటాస్’ తమిళ రీమేక్ ట్రైలర్ ఇదిగో, లారెన్స్ దుమ్ము రేపాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగు చిత్రం 'పటాస్‌'కు రీమేక్‌గా తమిళంలో రూపొందుతున్న 'మొట్ట శివ కెట్ట శివ' . కళ్యాణ్‌ రామ్‌ హీరోగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్ చిత్రం ఏ రేంజ్ హిట్టు కొట్టిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై 'మొట్ట శివ కెట్ట శివ' అనే టైటిల్‌తో రమణి తమిళంలో తెరకెక్కిస్తున్నారు.

లారెన్స్ సరసన నిక్కీ గల్రానీ హీరోయిన్‌గా నటించనుండగా, సత్యరాజ్‌, కోవై సరళ, దేవ దర్శిని కీలక పాత్రలలో నటిస్తున్నారు. కామెడి ప్లస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ఇందులో లారెన్స్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆడియన్స్ కి ఫుల్ కిక్కిచ్చాడనే చెప్పాలి. ఖాకీ డ్రెస్‌ ధరించి గుండుతో కనిపిస్తున్న లారెన్స్ ఈ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నారు. పరీక్షలు, ఎన్నికలు ముగిసిన తరువాత మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో లారెన్స్ మార్క్‌ కామెడీ తప్పకుండా ఉంటుందని, కామెడీ ప్లస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'మొట్ట శివ కెట్ట శివ' ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

 Raghava Lawrence's Motta Shiva Ketta Shiva trailer

ఇక 'మొట్ట శివ కెట్ట శివ' చిత్రం విడుదల కాకుండా కొంతమంది కుట్ర పన్నుతారని, వారి చర్యలను అడ్డుకోవాలని కోరుతూ నటుడు లారెన్స్, నిర్మాత ఆర్‌బీ చౌదరి క్రిందటి నెలలో చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు ఎస్‌ఆర్‌ ఎంకు చెందిన నిర్మాణ సంస్థలో మదన నిర్మాతగా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రెండు చిత్రాలు చేసేందుకు అంగీకరించారు.

అందులో ఒక చిత్రానికి 'మొట్ట శివ కెట్ట శివ' అనే టైటిల్‌ పెట్టారు. ఆ సమయంలోనే 'పటాస్‌' రీమేక్‌ని లారెన్స్ హీరోగా ఆర్‌బీ చౌదరి సెట్స్‌పైకి తీసుకెళ్లారు. కథ ప్రకారం ఈ చిత్రానికి 'మొట్ట శివ కెట్ట శివ' టైటిల్‌ బాగుంటుందని భావించి, మదన్ అంగీకారం మేరకు టైటిల్‌ను మార్పు చేశారు. అయితే ఇప్పటికీ మదన నిర్మిస్తున్న చిత్రంగానే భావించి విడు దలకు సిద్ధమ వుతున్న తరుణంలో కొంత మంది కుట్ర పన్నుతున్నారని, దానిని అడ్డుకోవాలని లారెన్స్, ఆర్‌బీ చౌదరి పోలీసు కమిషనర్‌ను కోరారు.

మరో ప్రక్క ..క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌ గా తమిళంలో అదే టైటిల్ తో శివలింగ మూవీ చేస్తున్నాడు లారెన్స్ . పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

English summary
The trailer of Raghava Lawrence's Motta Shiva Ketta Shiva was released .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu