»   » రజనీ 'లింగా' కి రామ్ చరణ్ విలన్

రజనీ 'లింగా' కి రామ్ చరణ్ విలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'లింగా' . కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఇప్పటికే జగపతిబాబు ఉండగా, మరొక విలన్ గా దేవగిల్ నటిస్తున్నారని సమాచారం. ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఫ్లాష్ బ్యాక్ లో దేవగిల్ కనిపిస్తారని చెప్తున్నారు. దేవగిల్ గతంలో మగధీర చిత్రం ద్వారా విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. 'లింగా'కు రత్నవేలు కెమెరాను నిర్వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బ్రిటిష్ నటి లారెన్ జె ఇర్విన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇదే కనుక జరిగితే...ఇదే ఇంత తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతున్న రజనీ తొలి చిత్రం అంటున్నారు. దాంతో ఆయన అభిమానులే కాక సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
'లింగా' తొలి షెడ్యూల్ మైసూర్‌లో, రెండో షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లోనే అనుష్క పాల్గొంటోంది. ఇప్పటిదాకా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తెలుగు హక్కులు కూడా దాదాపు రూ.30 కోట్ల దాకా పలుకుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Rajini's Lingaa has two villians


ఈ సినిమా కోసం రజనీకాంత్‌, దేవ్‌ గిల్‌పై రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రైలు సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పోరాట సన్నివేశానికి మాస్టర్‌ లీ నేతృత్వం వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ షూటింగ్ లో ఆయన బాహుబలి షూటింగ్ ని దగ్గర నుంచి చూద్దామని ఆశపడ్డారని సమాచారం. అయితే బాహుబలి టీమ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. ప్రభాస్ కు సర్జరీ జరగటం, ఎండలు దృష్టిలో పెట్టుకుని రాజమౌళి బ్రేక్ ఇచ్చారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ''రెండు తరాల వారధిగా సినిమా ఉండబోతోంది. రజనీకాంత్‌ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ తరహా చిత్రమిది. కె.ఎస్‌.రవికుమార్‌ చక్కటి కథతో ప్రేక్షకులను విస్మయపరచబోతున్నారు. రజనీ వైవిధ్య శైలి, కె.ఎస్‌.రవికుమార్‌ పాళి కలిసి సినిమా కొత్తగా ఉండబోతోంది'' అంటున్నారు.

మరోప్రక్క దక్షిణాదిలో తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'లింగా'లోని నటనకుగాను రజనీ సహా చిత్రబృందమంతా పొగడ్తలతో ఆమెను ముంచెత్తిందట. ''దక్షిణాదికి కొత్త అయినప్పటికీ సోనాక్షి మెరుగైన నటనను ప్రదర్శిస్తోంది. తొలి టేక్‌లోనే సన్నివేశాలను పూర్తి చేసుకుంటోంది'' అంటూ యూనిట్ సోనాక్షిని పొగిడేస్తోంది.

చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

English summary
Superstar Rajinikanth’s upcoming film ‘Linga’. While one villain is Jagapathi Babu, another villain is Dev Gill who scared all in Ram Charan's ‘Magadheera’. KS Ravikumar, who is directing the movie is planning to complete the shooting in next 60 days time and the movie will hit the silver screens for this year’s Deepavali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu