»   » రోబో2 రికార్డు.. విడుదలకు ముందే సంచలనం..

రోబో2 రికార్డు.. విడుదలకు ముందే సంచలనం..

Written By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న '2.0' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తున్నది. ఈ చిత్రం హిందీ హక్కులు రూ. 80 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. అంతేకాదు అన్ని భాషల్లో రోబో శాటిలైట్‌ హక్కులను జీ టెలివిజన్‌ రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఇదే నిజమైతే సినిమా విడుదలకు ముందే దాదాపు రూ. 200 కోట్లు రాబట్టిన చిత్రంగా ఓ ఘనతను సొంతంచేసుకొంటుంది.

Rajinikanth-Akshay Kumar's 2.0 made Rs 200 crore even before its release

ఇదిలా ఉండగా డిజిటల్ రైట్స్ ‌పై కూడా బిజినెస్ భారీగానే జరుగనున్నదనే ప్రచారం కొనసాగుతున్నది. రోబో చిత్రం డిజిటల్ రైట్స్ గురించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు పోటీపడుతున్నాయి. 'రోబో'కు సీక్వెల్‌గా దర్శకుడు శంకర్‌ '2.0'ను రూపొందిస్తున్నారు. అమీ జాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది '2.0' ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Reportedly, Robo2.0, which is being made at a budget of Rs 450 crore, is touted to be the costliest Indian film till date. Previously, it was revealed that the satellite rights of Rajinikanth and Akshay's sci-fi thriller was sold for Rs 110 crore to Zee, and that the makers are in talks with Netflix and Amazon regarding the digital rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu