»   » క్షమాపణ చెప్పిన రజనీ

క్షమాపణ చెప్పిన రజనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మలేషియాలో ఉన్న తన అభిమానులను ఉద్దేసించి రజనీకాంత్ మాట్లాడుతూ...క్షమాపణ చెప్పారు. అందరితో తాను ఫొటోలు దిగలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. చాలా మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగాలని ముచ్చటపడిన నేపధ్యంలో ఆయన తన ఆసక్తతను వ్యక్తం చేస్తూ మలేషియా వదిలేటప్పుడు ఇలా తెలియచేసారు.తను మనస్పూర్తిగా సారి చెప్తున్నాను అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రజనీ మాట్లాడుతూ... "నేను ఇంత అందంగా మలేషియా దేసం ఉంటుందని ఊహించలేదు. నేను చివరిసారిగా ఈ దేశానికి 1978లో ప్రియా షూటింగ్ కు వచ్చాను. మళ్లీ ఇప్పుడే రావటం "అన్నారు.

అలాగే కబాలిలో తన పాత్ర గురించి చెప్తూ.. . "కబాలి చిత్రం మలేషియాలో పుట్టి పెరిగిన వ్యక్తి గురించి, అలాగే ఈ చిత్రం మలేషియా జనం గురించి, ఈ దేశం గురించి దర్శకుడు చిత్రీకరించిన తీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ", అన్నారు.

Rajinikanth Apologizes To Fans, Says 'Kabali' Is Born & Brought Up In Malaysia!

చిత్రం విశేషాలకు వస్తే..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'కబాలి'. ఇందులో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. దన్షిక, రిత్వికా, దినేష్‌, కలైయరశన్‌, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు, నటీనటుల ఎంపికను దర్శకుడు రంజితకే వదిలేయడంతో.. రజనీతో ఇదివరకు చేయని నటులు పలువురు ఇందులో కనిపించనున్నారు.

ముఖ్యంగా సినిమాలో హైలెట్ గా నిలిచే విలన్‌ పాత్రను కూడా మలేషియా నటుడికే అప్పజెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో స్థానికంగా మరింత అంచనాలు పెరిగాయి 'కబాలి'కి.

ప్రస్తుతం ఈ సినిమా సన్నివేశాలను మలేషియాలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగను కూడా రజనీకాంత్‌ అక్కడే అభిమానుల మధ్య జరుపుకున్నారు. 75 శాతం సన్నివేశాలను మలేషియాలో షూటింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా సినిమాలో పలువురు మలేషియా నటులు కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం.

Rajinikanth Apologizes To Fans, Says 'Kabali' Is Born & Brought Up In Malaysia!

ఈ సినిమాకు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. మలేషియా, సింగపూర్‌ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా స్థానికంగా రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న టార్కి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈయనతోపాటు మరో ముగ్గురు మలేషియా నటులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

తెలుగులోనూ విడుదల కానున్న ఈ సినిమాకి 'మహదేవ్‌' అనే పేరును నిర్ణయించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా, ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నట్గు తెలిసింది. ఈ చిత్రం కోసం రజనీ తెల్లటి గెడ్డంతో ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తున్నారు.

English summary
Speaking to Malaysian fans and media before his departure from the country, superstar Rajinikanth apologized to those, with whom he couldn't pose for photographs. This statement has come after the Enthiran man obliged most of his fans for thousands of selfies.
Please Wait while comments are loading...