»   » రోబోలో నగ్నంగా రజనీకాంత్

రోబోలో నగ్నంగా రజనీకాంత్

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు రజనీకాంత్, డైనమిక్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం రోబో. అందాల తార ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటిస్తోంది. హైటెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాను తలదన్నే విధంగా రూపొందుతోందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న రజనీకాంత్ ఈ సినిమాలో శాస్త్రవేత్తగా, రోబోగా రెండుపాత్రలు పోషిస్తున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాలోని ఓ ముఖ్య సన్నివేశంలో రజనీ నగ్నంగా నటించాడని కోలీవుడ్ సమాచారం. ఈ సన్నివేశాన్ని ఇటీవలే చెన్నై శివార్లలోని సన్ నెట్ వర్క్ స్టుడియోలో చిత్రీకరించారని తెలిసింది. ఈ సన్నివేశం టర్మినేటర్ సినిమాలో ఆర్నాల్డ్ చేసిన నగ్న సన్నివేశాన్ని పోలి వుంటుందని, కథలో ఈ సన్నివేశానికి చాలా ప్రాముఖ్యత వుండబట్టే రజనీ కూడా ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా ఈ సన్నివేశం చేసాడని సమాచారం. ఇక పోతే ఇంతకు ముందు అభయ్ అనే సినిమా కోసం కమల్ హాసన్ కూడా ఇలాగే నగ్నంగా దర్శనమిచ్చాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu