»   » ఈ విషాద సమయంలో పుట్టినరోజు వేడుకలొద్దు: ఫ్యాన్స్‌కి రజనీకాంత్ లేఖ

ఈ విషాద సమయంలో పుట్టినరోజు వేడుకలొద్దు: ఫ్యాన్స్‌కి రజనీకాంత్ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులో పండగవాతావరణం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 12 వచ్చిదంటే ఆయన పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగే అవకాశం లేదు. రజనీకాంత్ ఈవేడుకలను రద్దు చేసుకున్నారు. అభిమానులకు కూడా ఈ మేరకు లేఖ రాసారు. తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, ఈనెల 12న బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని అభిమానులను కోరారు.

కారణం జయలలిత

కారణం జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబరు 6న కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.

rn

జయ పార్థీవదేహాన్ని చూసి రజినీ కంటతడి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసి తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ భావోద్వేగానికి గురయ్యారు. రాజాజీ హాల్లోని ఆమె భౌతికకాయానికి మంగళవారం ఉదయం రజినీకాంత్‌ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. జయను చూసిన రజినీకాంత్‌ బావోద్వేగాన్ని అపుకోలేక కంటతడి పెట్టారు.

సిగరెట్‌ వెలిగించి జయలలితను ఇరికించిన రజనీకాంత్... అప్పట్లో సంచలనం!

సిగరెట్‌ వెలిగించి జయలలితను ఇరికించిన రజనీకాంత్... అప్పట్లో సంచలనం!

కేవలం తమిళనాడు మాత్రమే కాదు, ఎంటైర్ నేషన్ జయలలిత మరణంతో శోక సముద్రంలో మునిగిపోయింది. మా గౌరవ ముఖ్యమంత్రి ఆత్మకు శాంతికలగాలి అంటూ రజనీకాంత్ ట్వీట్ చేసారు. అయితే గతంలో వీరి మధ్య పరిస్థితి మరోలా ఉండేది. ఓ సారి జయలలితకు, రజనీకాంత్ మధ్య జరిగిన సంఘటన హాట్ టాపిక్ అయింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా?

రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా?

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘2.0'. ఇంతకు ముందు వచ్చిన ‘రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. రూ. 360 కోట్ల పై చిలుకు బడ్జెట్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
This year though Rajini is in the city he has requested his fans and followers not to celebrate his birthday due to the passing away of the former chief minister Jayalalitha. He has also requested to avoid banners and posters.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu