»   » రజనీ కోసం నిప్పులు తొక్కుతూ, శూలాలు గుచ్చుకొంటున్నఫ్యాన్స్

రజనీ కోసం నిప్పులు తొక్కుతూ, శూలాలు గుచ్చుకొంటున్నఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజిని గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అస్వస్థత ఫై వచ్చిన పలు రకాల దుమారాలు రజిని అభిమానులలోను, సన్నిహితులలోను ఆందోళన కలిగించింది. ప్రస్తుతం చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, వదంతులను నమ్మవద్దు అని ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు తెలియజేసారు.

అలాగే కొంతమంది ప్రముఖులు రజిని ని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తెలుగుదేశం పార్టి అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రజిని కాంత్ ను పరామర్శించారు. తరవాత వారు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బాగా మాట్లాడుతున్నారు, జోకులు కూడా వేస్తున్నారు అని తెలియ జేసారు.

మరో వైపు రజిని అభిమానులు ఆయనకు స్వస్థత చేకూరాలని పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రముఖ దేవాలయాలలో అర్చనలు, అభిషేకాలు చేయిస్తున్నారు. అగ్ని గుండలలో నిప్పులు తొక్కుతూ, వంట్లో శూలాలు గుచ్చుకుంటు రజిని త్వరగా కోలుకోవాలని మొక్కులు చెల్లిస్తున్నారు.

English summary
Super Star Rajinikanth is suffering from viral fever from few days and is getting treatment at Ramachandra Hospital in Chennai, Hospital resources rule out the rumors about and told that he is in good health as of now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu