»   » విడాకుల కోసం కోర్టుకు రజనీకాంత్ కూతురు.. పొలిటికల్ ఎంట్రీకి ముందు..

విడాకుల కోసం కోర్టుకు రజనీకాంత్ కూతురు.. పొలిటికల్ ఎంట్రీకి ముందు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్‌తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా సౌందర్య దంపతుల మధ్య విభేదాల నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టుకు సౌందర్య హాజరయ్యారు. అశ్విన్‌తో సౌందర్య వివాహం 2010లో జరిగింది. సౌందర్య, అశ్విన్‌రే వేద్‌ అనే కుమారుడు ఉన్నాడు. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో గతేడాది విడిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. రజనీ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో కుటుంబంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Rajinikanth daughter Soundharya's divorce petition in Chennai Family Court

సౌందర్య, అశ్విన్ దంపతుల విడాకుల కేసు విచారణను కుటుంబ న్యాయస్థానం శుక్రవారం విచారించింది. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించినా దంపతులిద్దరూ ఉమ్మడి అంగీకారంతో విడిపోతున్నామని కోర్టుకు పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలుపుతూ, ఉమ్మడి అంగీకారంతో కూడిన ఓ మోమోను ఇద్దరు సమర్పించాలని కోర్టు సూచించింది. దంపతులిద్దరితో సంప్రదింపుల అనంతరం వారి మెమోతో సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనున్నది. ఈ ఉమ్మడి అంగీకార పత్రంలో భరణం వివరాలు, పిల్లాడి సంరక్షణ బాధ్యతలు తదితర అంశాలు ఉండే అవకాశం ఉంది.

Rajinikanth daughter Soundharya's divorce petition in Chennai Family Court
English summary
Rajinikanth daughter Soundharya files divorce petition in Chennai Family Court recently. Court consedered the petition and asked to file a memo for the reason behind the divorce
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu