»   » రజనీపై కమల్ షాకింగ్ కామెంట్స్.. కమల్‌కు ముగ్గురు తండ్రులని రజనీ కౌంటర్

రజనీపై కమల్ షాకింగ్ కామెంట్స్.. కమల్‌కు ముగ్గురు తండ్రులని రజనీ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. తన సోదరుడు చంద్రహాసన్ స్మారక సమావేశంలో మాట్లాడుతూ రజనీకాంత్ నాకు పెద్దన్నయ్య అని చెపుతూ ఉద్వేగానికి గురయ్యారు. కమల్ హాసన్ పెద్దన్నయ్య చంద్రహాసన్ మార్చి 18న లండన్‌లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 80 దశకంలో సూపర్‌స్టార్లుగా వెలుగొందిన రజనీ, కమల్ మధ్య ఎన్నో విభేదాలు ఉన్నాయి. అయితే ఈ సభలో మనసు విప్పుకొని ఆత్మీయంగా మాట్లాడుకోవడంపై సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రజనీ నాకు పెద్దన్నయ్య

రజనీ నాకు పెద్దన్నయ్య

చంద్రహాసన్ స్మారక సభ నిర్వహించగా దానికి సినీ ప్రముఖులు రజనీకాంత్, సత్యరాజ్, నాజర్, విశాల్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని చెన్నైలోని కామరాజ్ అరంగమ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో నాకు ఎందరో పెద్దన్నయ్యలు ఉన్నారు. రజనీకాంత్ అందులో ఒకరు అని అన్నారు.

ఆస్తులు కూడబెట్టుకోలేదు..

ఆస్తులు కూడబెట్టుకోలేదు..

ఈ సమావేశంలో రజనీకాంత్ ఉద్వేగంతో ప్రసంగించారు. ఈ తరం నటుల మాదిరిగా కమల్ హాసన్‌కు ఆస్తిపాస్తులు లేవు. సొంత ఆస్తులను కూడగట్టుకోలేదు. ఆయన సంపాదించిందంతా సినిమాకే ఖర్చుపెట్టారు అని రజనీకాంత్ అన్నారు.

కమల్‌కు ముగ్గురు తండ్రులు

కమల్‌కు ముగ్గురు తండ్రులు

ఈ సభలో చంద్రహాసన్‌కు శ్రద్ధాంజలి ఘటించిన రజనీకాంత్ ప్రసంగిస్తూ .. కమల్ తన జీవితంలో ముగ్గురు వ్యక్తులను తండ్రిగా భావించారు. అందులో ఒకరు కే బాలచందర్, ఆ తర్వాత ఆయన పెద్దన్నయ్య చారుహాసన్. మూడో వ్యక్తి చంద్రహాసన్ అని అన్నారు. చారు అన్నతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించాను. చంద్రహాసన్‌ను రెండుసార్లు కలిశాను అని రజనీకాంత్ అన్నారు.

రోబో 2.0 రజనీ.. శభాస్ నాయుడులో కమల్

రోబో 2.0 రజనీ.. శభాస్ నాయుడులో కమల్

ప్రస్తుతం రజనీకాంత్ రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రం షూటింగ్ దశలో ఉన్నది. కమల్‌ కాలికి గాయం కావడంతో ఈ షూటింగ్ వాయిదా వేశారు. కాగా విశ్వరూపం2 చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
At Chandrahasan's memorial meet, Kamal Haasan said he considers superstar Rajinikanth as his elder brother. Condoling Chandrahasan, Rajinikanth said, "Kamal considers three persons as his father. First is our director K Balachander. Next, his elder brother Charuhasan. Thirdly, his brother Chandrahasan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X