For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్స్ కు ఇదే నా పుట్టినరోజు కానుక:రజనీకాంత్

  By Srikanya
  |

  చెన్నై : తన తాజా చిత్రం 'శివాజీ 3డీ' తన పుట్టినరోజు కానుకని అంటున్నారు రజనీకాంత్‌. ఏటా సూపర్‌స్టార్‌ జన్మదినాన్ని అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. ఈసారి 12-12-12తో ప్రత్యేకత సంతరించుకోవటంతో వారు మరింత ఉత్సాహంతో ఉన్నారు. దానిని రెట్టింపు చేస్తూ 'శివాజీ 3డీ' అదే రోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విశేషాలు తెలిపే కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది.

  ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... నేను చెన్నైలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయాను. సినిమా అత్యద్భుతంగా వచ్చింది. 3డీ హంగులు అద్దేందుకు వెచ్చించిన ఖర్చుతో రెండు కొత్త చిత్రాలు తీయొచ్చు. ఏవీఎం సంస్థ ప్రతిష్ట మరింత పెంచేదిగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులకు నేనిస్తున్న జన్మదిన కానుక. 3డీ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

  సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలుకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్. ఆ సినిమాలు ఎన్ని సార్లు రిపీట్ రిలీజ్ లు ఉన్నా జనం ఎగబడి చూస్తారు. అలాంటిది ఆ సినిమాని త్రీడి కి కన్వర్ట్ చేసి వదిలితే భాక్సాఫీస్ బ్రద్దలు అవుతుంది. ఇప్పుడిదే కమర్షియల్ ఫార్ములతో రనజీకాంత్ సూపర్ హిట్ చిత్రం శివాజీని మారుస్తున్నారు. 'సింహం సింగిల్‌గా వస్తుంది'.. అంటూ 'శివాజి' చిత్రంలో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్‌. శంకర్‌ దర్శకత్వంలో 2007లో వచ్చిందీ చిత్రం. ఏవీఎమ్‌ సంస్థ నిర్మించింది. రజనీ సరసన శ్రియ నటించింది. త్వరలో 'శివాజి'ని 3డీలో చూపించబోతున్నారు.

  శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం 'శివాజీ'. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏవీయమ్‌ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమాకి 3డీ సొబగులు అద్దుతున్నారు. గతేడాది నుంచి ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే త్రీడీ సినిమా కోసం నిడివి తగ్గించాల్సి వస్తోంది. కథాగమనం దెబ్బతినకుండా కొన్ని సన్నివేశాలను

  తొలగించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇక ఈ చిత్రం 185 నిమిషాలపాటు సాగుతూంటే యాక్షన్ ఎంటర్టైనర్. ప్రస్తుతం త్రీడి వెర్షన్ కోసం 137 నిమిషాలకు కుదిస్తున్నారు. అంటే 48 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర్లు పడతాయన్నమాట. 2డీ పరిజ్ఞానంతో చిత్రించిన ఈ సినిమాను ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నారు. చెన్నైలోని ప్రసాద్‌ ఈఎఫ్‌ఎక్స్‌లో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

  ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న 'కోచ్చడయాన్‌' శరవేగంగా సాగుతోంది. శివాజీ 3డీ విడుదలైన తరువాత 'కోచ్చడయాన్‌' జనం ముందుకొస్తుంది. ఇది డిసెంబరులో విడుదలవుతుంది.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారు. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  English summary
  South India superstar Rajinikanth's blockbuster Sivaji would soon entertain fans in 3D. Its Rajinikanth's first movie in three dimension and the excited actor himself. The 3D version will be relese in Tamil, Telugu and Hindi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X