»   » తలైవా భలే గడ్డిపెట్టారే.. రజనీకాంత్ దుమ్ము దులిపేశారు.. భాషా స్టయిల్‌లో డైలాగ్స్..

తలైవా భలే గడ్డిపెట్టారే.. రజనీకాంత్ దుమ్ము దులిపేశారు.. భాషా స్టయిల్‌లో డైలాగ్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Secret Plan On Politics..

రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన చేసిన తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి ప్రజల్లోకి వెళ్లారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతిత తెలిసిందే. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎంజీఆర్ పాలనను మళ్లీ తెచ్చేందుకే నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను అని అన్నారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడారంటే..

ఎంజీఆర్ పాలన

ఎంజీఆర్ పాలన

యువకులు, టెక్నాలజీ, మేధావుల సహకారంతో తమిళనాడులో ఎంజీఆర్ పాలనను తీసుకొస్తాను. ప్రజల ముందు బడా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

 తమిళనాడులో నాయకత్వ లోపం

తమిళనాడులో నాయకత్వ లోపం

తమిళనాడులో నాయకత్వం లోపం ఉంది. రాజకీయంగా రాష్ట్రంలో సంక్షోభం నెలకొన్నది. జయలలిత దివంగతులయ్యారు. దిగ్గజ నేత కరుణానిధి అనారోగ్యానికి గురయ్యారు. అందుకే నేను వస్తున్నాను అని రజనీకాంత్ చెప్పారు.

నన్ను ఎద్దేవా చేయవద్దు

నన్ను ఎద్దేవా చేయవద్దు

తాను రాజకీయాల్లోకి రావడం పట్ల కొందరు ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతున్నారు. నన్ను నిరుత్సాహ పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీకాంత్ ధ్వజమెత్తారు. చవకబారు రాజకీయాలు చేయడానికి నేను రాజకీయాల్లోకి రావడం లేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే కోరికతోనే వస్తున్నాను అని చెప్పారు.

 రాజకీయాలంటే కష్టమే

రాజకీయాలంటే కష్టమే

రాజకీయాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. నేను ఎవరినో నిందించడానికో లేదా విమర్శలు, ఆరోపణలు చేయడానికో పాలిటిక్స్‌లోకి రావడం లేదు. ప్రజా జీవితానికి అంకితమవుదామని వస్తున్నా అని రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు.

ఇప్పుడిప్పుడే జనంలోకి

ఇప్పుడిప్పుడే జనంలోకి

రాజకీయ పార్టీ ప్రకటించినప్పటికీ రజనీకాంత్ ఇంకా పార్టీ విధివిధానాలను ప్రకటించలేదు. ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ నేతగా అవతరించలేదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో

ఇక సినీరంగంలో రజనీకాంత్ నటించిన రోబో2.0, కాలా కరికాలన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలతోపాటు మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రూపొందించే చిత్రంలో తలైవా నటించేందుకు సిద్ధమవుతున్నారు.

English summary
March 5th was a big day for Rajinikanth and his fans as Thalaiva made his first public appearance post is political announcement. Rajinikanth talked about need for a leader to fill the vacuum TN leadership was witnessing. He also talked wanting to revive MGR’s rule. “With the help of technology and the support of youngsters, resourceful people and intellectuals, I too can provide that kind of a rule,” declared the actor. Big Politicians should speak carefully in-front of ppl.. There is a vacuum in TN for leadership.. Hence I am coming..Ex-CM Jayalalithaa is no more.. #Kalaignar is sick.. Hence I am coming to fill the vacuum of leadership in state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu