»   » సినిమా ప్లాప్ టాక్.... మరో వైపు రజనీకాంత్ ప్రశంసలు?

సినిమా ప్లాప్ టాక్.... మరో వైపు రజనీకాంత్ ప్రశంసలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘పులి' ఇటీవల విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యంగా విడుదలైన ఈ సినిమాకు వెంటనే నెగెటివ్ టాక్ రావడం మరో పెద్ద షాక్. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సైతం ఇలాంటి సినిమా విజయ్ ఎలా ఒప్పుకున్నాడని ఆశ్చర్య పోతున్నారు. పరిస్థితి చూస్తుంటే సినిమా నిర్మాతలకు భారీ నష్టాల తప్పేలా లేవు. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Rajinikanth praise Vijay's film

అయితే తమిళ స్టార్ రజనీకాంత్‌ మాత్రం ఈ సినిమా చాలా బావుందంటూ ప్రశంసించారు. విజయ్ పెర్ఫార్మెన్స్‌పై, శ్రీదేవి యాక్టింగుపై పొగడ్తలు గుప్పించారు. ఈ విషయాన్ని పులి నిర్మాతలు మీడియాకు వెల్లడించారు. ‘పులి' సినిమాను ఓ స్పెషల్ షో వేయించుకుని రజినీ చూశారని, ఫాంటసీ యాక్షన్ మీద నమ్మకంగా అంత ఖర్చు పెట్టినందుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తమను అభినందించారని.. ఈ మూవీతో సౌత్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికి అభినందనలు తెలపాల్సిందిగా చెప్పారని ఎస్కేటీ స్టూడియోస్ ట్విట్టర్ లో వెల్లడించింది.

మరో వైపు హీరోయిన్ తమన్నా కూడా ఈ సినిమాపై, విజయ్ పెర్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించింది. తమిళ యాక్టర్ జయం రవి, మరో తమిళ నటుడు జీవ తదితరులు పులి సినిమాపై, విజయ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. ఓ వైపు నెగెటివ్ టాక్, మరో వైపు స్టార్ల ప్రశంసలు....పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి.

English summary
Rajinikanth has said that he is highly impressed by the grand sets and colourful visuals. He also pointed out that he liked Vijay's electrifying acting in the flick. The superstar also praised Sridevi's performance and also had good words about the quality of the film, which he compared to Hollywood standards.
Please Wait while comments are loading...