Just In
Don't Miss!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- News
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ రజనీకాంత్ 'రోబో' చిత్రం పెద్ద ప్లాప్
రజనీకాంత్ తాజా చిత్రం "రోబో" అన్ని చోట్ల సంచలన విజయం సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంప్రదాయ తమిళులు అధికంగా ఉన్న శ్రీలంకలో మాత్రం ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. శ్రీలంకలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 'రోబో' తమిళ వెర్షన్ గ్రాండ్ గా రిలీజైనా మొదటి వారానికే కొలంబో, జాఫ్నాలలో కొన్ని థియేటర్లలో తీసివేశారు. ఇప్పుడు అక్కడ చాలా చోట్ల తీసేస్తున్నారు. కొలంబో లోని సినీసిటీ కాంప్లెక్స్ లో నాలుగు హాళ్లలో చిత్రం విడుదలకాగా ఇప్పుడు రెండింటిలోనే ప్రదర్శిస్తున్నారు. అవికూడా హౌస్‌ఫుల్‌గా నడవటం లేదు.ఒకటి రెండు వారాల్లో తీసేస్తామని చెప్తున్నారు. దీనికి కారణంగా అక్కడ వారు...ఇది తమిళ చిత్రం కాదని ఇంగ్లిష్ సినిమా అని భావిస్తున్నామని అంటున్నారు.
అక్కడ ప్రముఖ ఎగ్జిబిటర్ ఎస్.త్యాగరాజయ్య మాట్లాడుతూ జాఫ్నాలో తనకు రెండు థియేటర్లున్నాయని రెంటిలోనూ చిత్రం ప్రదర్శన ప్రారంభించామని కాని ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవటంతో ఒక హాలులో తీసివేశామని చెప్పారు. సాంస్కృతికంగా ఇది తమకు దూరంగా ఉందని లంక తమిళులు భావించటమే అందుకు కారణమని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది సైంటిఫిక్ ఫిక్షన్(శాస్త్రీయ విజ్ఞానం ప్రాతిపదికగా కల్పనలతో కూడింది) ఇది హాలీవుడ్ చిత్రం మాదిరి ఉందని చెప్పారు. అందువల్ల సాంప్రదాయిక తమిళ కుటుంబాలు ఎక్కువగా కల జాఫ్నాలో ఇది ఎక్కువగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదని వివరించారు.
ఇక తమిళ చిత్రం అంటే సాంప్రదాయిక మసాలా ఉండాలని తమిళ కామెడీని ప్రేక్షకులు ఇష్టపడతారని జాఫ్నా లోని సినిమా ధియోటర్ ఓనర్ ఎస్.పూపాల సింగం అన్నారు. తనకు తమిళ సినిమాలు అంటే ఎంతో ఇష్టమన్నారు. మామూలుగా తమిళ సినిమాల్లో ఉండే కామెడీ ఇందులో లేదని గౌండమణి, సెంతిల్, వడివేలు లాటి హాస్యనటుల కామిడీ లేదని చెప్పారు. మామాలుగా కొత్త తమిళ చిత్రం లంకలో విడుదలైతే ప్రేక్షకులు మళ్లీమళ్లీ చూస్తారు. కాని రోబో చిత్రాన్ని అలా చూడటం లేదు.
ఇక చిత్రం బడ్జెట్టు ఖర్చు గురించి విపరీతంగా ప్రచారం చేసినందువల్ల ప్రారంభంలో మంచి వసూళ్ళు వచ్చాయి. పైగా సూపర్ స్టార్ రజనీ, ఐశ్వర్య రాయ్ తో నటించారంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. కాని ప్రేక్షకులు మరో సారి చిత్రాన్ని చూడకపోవటంతో ఆరంభంలో ఉన్న రద్దీకి బ్రేక్ పడిందని అన్నారు. కొలంబోలోని సవాయ్ థియేటర్లో రోబో హిందీ సినిమాను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో చూపించారు.కాని అది ఎవరికీ ఎక్కలేదు. మరో ప్రక్క ఇక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకున్న కరణ్ జోహార్....'ఫ్యామిలీ' చిత్రం (కరీనా కపూర్, కాజోల్) మాత్రం అక్కడ సినీ అభిమానులను ఆకట్టుకుని ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సంపాదించుకుంటోంది.