»   » మాఫియా డాన్ కాంట్రవర్సీ: రజనీకాంత్ మూవీ టీం వివరణ

మాఫియా డాన్ కాంట్రవర్సీ: రజనీకాంత్ మూవీ టీం వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' తర్వాత ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రారంభం కానుంది.

అయితే సినిమా ఓ మాఫియా డాన్ జీవితం ఆధారంగా తీస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేసాయి. మాఫియా కార్యకలాపాలతో ముంబై మహానగరాన్ని గడగడలాడించిన హాజీ మస్తాన్ మీర్జా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తోందని, దీంతో హజీ మస్తాన్ వారసుడు రజనీకాంత్ చిత్ర టీంను హెచ్చరించారని, ఈ సినిమా తీయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

Rajinikanth

అయితే ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌బార్‌ ఫిల్మ్స్ వివరణ ఇచ్చింది. రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్లో వస్తున్న మూవీ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతోందని, ఎవరి జీవితం ఆధారంగా ఈ సినిమా తీయడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో మాఫియా డాన్ కాంట్రవర్సీకి తెరపడినట్లయింది

హాజీమస్తాన్ ముంబైలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. స్మగ్లింగ్, సినిమాలకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హవాలా కార్యక్రమాలతో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని 1926 రెంయి 1994 వరకు ఏలిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ మాఫియా సంబంధాలతో హాజీ మస్తాన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.

కడు పేదరికంలో పుట్టిన హాజీ మస్తాన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపాలనే కోరిక చిన్నతనం నుంచే ఉందని హాజీ మస్తాన్ బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వెనుక తమిళుడైన వరదరాజన్ ముదలియార్ హస్తం, మద్దతు ఉందనే చెబుతుంటారు.

English summary
Super Star Rajinikanth’s soon to be launched movie in Kabali’s director Pa Ranjith’s direction and Dhanush’s production will have a Mumbai underworld backdrop. This as-yet-untitled movie will go on floors​ on May 28. The film’s makers at Wunderbar Films banner issued a press note, clarifying that Rajini’s film is completely fictitious and that it is not a biopic based on anyone’s lif
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu