twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి' పైరసీ చేసారు, టోరెంట్స్ తొలిగించమంటూ కోర్టుకు

    By Srikanya
    |

    చెన్నై: రజనీకాంత్ తాజా చిత్రం కబాలి కు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. ఉడ్తాపంజాబ్, సుల్తాన్ చిత్రాలు రిలీజ్ కు ముందే నెట్ లో ప్రింట్ లు కనపడినట్లే ఇప్పుడు కబాలి కు అలాగే జరిగింది. ఈ విషయమై నిర్మాత మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు.

    నిర్మాత ధాను... కబాలి చిత్రానికి చెందిన దాదాపు నూట ఎనభై కు పైగా పైరసి లింకులను గుర్తించామని, వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నందున వెంటనే ఆయా సైట్లలోంచి తమ సినిమా లింక్ లను తొలిగించాల్సిందిగా కోరారు. అంతేకాకుండా మొబైల్ డౌన్ లోడ్స్ ఊపందుకోకముందే తమని ఈ గండం నుంచి గట్టెంక్కించాల్సిందిగా ఆయన కోర్టువారిని వేడుకున్నారు.

    మొట్టమొదటి సారిగా మలయాళం భాషలో అనువాదమై విడుదలవుతున్న భారతీయ చిత్రం కబాలి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న చిత్రం కబాలి. రాధిక ఆప్టే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించారు.

    Rajinikanth's Kabali takes on pirates, producer Thanu moves Madras HC

    కబాలి ఇప్పటికే రిలీజ్ డేట్ ఇచ్చేసారు. దాంతో ప్రమోషన్స్ మరింత పెంచేస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం కొత్త పోస్టర్ ని ఒకదాన్ని తాజాగా విడుదల చేసారు. ఆ పోస్టర్ చూసిన వాళ్లు మామూలుగా లేదని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ కొత్త పోస్టర్ ని దర్శకుడు తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఈ పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండి. రజనీ అభిమానుల చేత విపరీతంగా షేర్ చేయబడుతోంది.

    కబాలి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం కూడా కబాలి కావొచ్చు. ఇలా విడుదలకు ముందే సంచలన రికార్డులు బద్దలు కొడుతున్న మన స్టైల్ కింగ్ చిత్రం విడుదల అనంత రం ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. కబాలిడా..నెరుప్పుడా..అంటున్నారు ఫ్యాన్స్.

    ఇక ఇప్పటికే కబాలి టీంతో ఒప్పందంలో భాగంగా విమానయాన సర్వీసుల కంపెనీ ఎయిరేషియాతో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ లో అది పెద్ద టెలికామ్ సంస్ద అయిన ఎయిర్ టెల్ కూడా కబాలి ప్రమోషన్ లో భాగం కాబోతోంది.

    English summary
    Producer of the movie S Thanu has moved the Madras high court to stop illegal download of the film by about 180 named websites and countless unknown sites, senior advocate Vijay Narayan told to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X