For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ 'కోచ్చడయాన్‌' అఫీషియల్ పోస్టర్ లుక్ (ఫోటో)

  By Srikanya
  |

  చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కోచ్చడయాన్‌'. ఆయన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. దీపికా పదుకొనే హీరోయిన్. ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ లుక్ ని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్ ద్వారా రివిల్ చేసారు. ఈ చిత్రంలో ఉండే రెండు గెటప్ లు ఈ పోస్టర్ లో ఉండటం విశేషం.

  ఇక ఈ చిత్రం 'కోచ్చడయాన్‌' అనే యోధుడు కథ ని తెలుపుతుంది. ఈ చిత్రంలో రజనీ...ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది వందశాతం రజనీ ఫార్ములా చిత్రం అని చెప్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఆయన కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే... ఇందలో ఇద్దరు రజనీలు ఉంటారు. ఇందులో సీనియర్‌ రజనీయే 'కోచ్చడయాన్‌'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్‌ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్‌ భరతనాట్య కళాకారుడు కూడా. యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించాం. అప్పుడు మా అందరికీ తోచిన పేరు శోభన.

  అలాగే...ఇందులో తండ్రి 'కోచ్చడయాన్‌'.. కుమారుడు 'రాణా'. తండ్రిని మించిన తనయుడు. తండ్రితో పోల్చితే వందరెట్లు వేగంగా దూసుకుపోయే వ్యక్తి. రజనీకాంత్‌ అభిమానిగా చెబుతున్నా.. కచ్చితంగా వందశాతం కమర్షియల్‌ హంగులు ఇందులో ఉన్నాయి. ఇదివరకు నాన్న పోషించని పాత్ర ఇది. అభిమానులు ఎదురుచూసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఓ సన్నివేశంలో ఠీవీగా, స్త్టెల్‌గా ఓ పంచ్‌ డైలాగు చెప్పి.. ఇంకాస్త స్త్టెల్‌గా నడిచివెళ్తుంటారు.. ఆ సన్నివేశాన్ని చూసి యూనిట్‌ మొత్తం క్లాప్‌ కొట్టింది.

  ఇక నాన్నకు రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లను అందించిన కేఎస్‌ రవికుమార్‌ ఈ చిత్రానికి స్క్రిప్టు రాశారు. రెహమాన్‌ సంగీతం సమకూర్చిన ఆరు పాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్నివర్గాలను ఆకట్టుకునే బాణీలవి. దీపికా పదుకొనే హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. చిత్రంలో రెండో కథానాయికగా శోభన కనిపిస్తారు. ఆమెది కథాపరంగా ఎంతో కీలకపాత్ర అని చెప్పుకొచ్చారమె.

  ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. టిన్‌టిన్‌, అవతార్‌.. తరహాలో ఈ చిత్రంలో మోషన్‌ కాప్చర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. చిత్ర ద్వితీయార్థానికి రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పే పనులు సాగుతున్నాయి. 'సుల్తాన్‌ ది వారియర్‌' ప్రారంభించినప్పుడు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం రాలేదు. అందువల్లే దాన్ని వదులుకున్నాం. 'కోచ్చడయాన్‌'లో కార్టూన్‌ సినిమాల్లా లాంటి ఫీల్‌ రాదు అన్నారు.

  English summary
  Good news for fans of Tamil megastar Rajinikanth, the first official picture of his new look in his next film Kochadaiyaan has been released. Rajinikanth's daughter Soundarya Ashwin tweeted the picture and wrote: A still from Kochadaiiyaan :). Kochadaiyaan, the superstar's first film after his recovery from kidney ailment, has been made using performance capturing technology. The filming of the much-awaited film is over and the team led by his director-daughter Soundarya Ashwin is busy with post production work.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X