For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన సీఎం అయ్యేవరకు నటించాడు.. నన్ను ట్రాప్‌లో పడేయలేరు.. రజినీ కామెంట్స్

|

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తెరపై ఆరాధ్య దైవంగా కొలిచేవారు కోకొల్లలు. భాషా, ప్రాంతం ఇలా వేటితో సంబంధం లేకుండా రజినీని ప్రేమించే వారున్నారు. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. వయసు ఆరుపదులు దాటినా.. యువ హీరోల కంటే వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ.. బిజిబిజీగా ఉన్నాడు.

రాజకీయాల్లోకి ఎంట్రీ..

రాజకీయాల్లోకి ఎంట్రీ..

జయలలిత మరణం తరువాత ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి రజినీ కాంత్, కమల్ హాసన్ లాంటి వారు పొలిటికల్ జర్నీని ప్రారంభించారు. అయితే రజినీ మాత్రం కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తూ.. అభిమానులను కలవర పెడుతున్నాడు. అసలు తమ నాయకుడు ఎప్పుడు వస్తాడు.. కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తాడు అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

లోకసభ ఎన్నికలకు దూరం..

లోకసభ ఎన్నికలకు దూరం..

రీసెంట్‌గా జరిగిన లోక్‌సభ ఎన్నికలకు రజినీ దూరంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పి సైలెంట్ అయ్యారు. కానీ కమల్ హాసన్ మాత్రం మొండిగా దూకి ముందుకు వెళ్లారు. అయితే అనుకుంతగా సక్సెస్ కాకపోయినా ఎటువంటి నిరాశకు లోనవ్వలేదు.

బీజేపీతో స్నేహబందం..

బీజేపీతో స్నేహబందం..

రజినీకాంత్ బీజేపీలో చేరతారని, బీజేపీకి మద్దతిస్తారని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తగ్గట్టే కేంద్ర మంత్రులు, రజినీతో భేటీ అవ్వడం జరుగుతోంది. దీంతో ఆ వార్తలు మరింత ఊపందుకుంటున్నాయి. అయితే వాటన్నంటిని ఖండిస్తూ రజినీ కాంత్ సెన్సేషనల్ కామెంట్సే చేశారు.

కాషాయాన్ని పులుమలేరు..

కాషాయాన్ని పులుమలేరు..

తనకు కాషాయ రంగును పులుమాలనుకుంటున్నారు.. తిరువళ్లువార్‌ను కూడా అలాగే చేద్దామని ప్రయత్నించారు కానీ వారి పప్పులేమీ ఉడకలేదు.. నేను కూడా అంతే వారి ట్రాప్‌లో పడను.. అంటూ ఆ రూమర్లకు చెక్ పెట్టేశాడు.

సీఎం అయ్యేవరకు నటించాడు..

సీఎం అయ్యేవరకు నటించాడు..

ఎంజీఆర్ సీఎం అయ్యే వరకు నటిస్తూనే ఉన్నాడు.. రాజకీయ పార్టీని ప్రకటించి.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేవరకు నటిస్తూనే ఉంటానని కుండబద్దలు కొట్టేశాడు. రజినీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం చేస్తుండగా.. శివ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

English summary
Rajinikanth Sensational Comments On Rumors About Joing BJP. Attempts are being continuously to adorn me with saffron just like Thiruvalluvar. Thiruvalluvar won’t be trapped and I also will not be trapped. will definitely act till I announce the political party. MGR acted till he became the CM.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more