ఇళయరాజా నాతో బీరు కొట్టి.. స్టార్ హీరోయిన్ల గురించి గాసిప్స్.. రజనీ లీక్స్
మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా సినీ ప్రపంచంలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఆయన సన్మాన సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో సీఎం స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సభ భావొద్వేగంతోపాటు వినోదంగా కూడా మారింది. రజనీకాంత్ స్పీచ్‌తో సంగీత ప్రియులను, అభిమానులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అయితే వారిద్దరి మధ్య అనుబంధాన్ని షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ సంఘటనను ఆయన వెల్లడించారు. ఈ సభలో రజనీ మాట్లాడుతూ..
ఇళయ రాజా టాప్ రేంజ్‌లో ఉన్న సమయంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ సడెన్‌గా పాపులర్ అయ్యాడు. అందరూ ఆయన కోసం పరుగులు పెడుతున్నాడు. అయితే ఈ విషయం గురించి ఎన్నడూ ఆయన చింతించలేదు. ఉదయమే 6 గంటలకు కారు వేసుకొని ప్రసాద్ స్టూడియోకు వెళ్లిపోయి తన పనిలో మునిగిపోయేవాడు. పురాణాలు, చరిత్రలో గొప్ప వ్యక్తుల గురించి వింటాం. కానీ నా జీవితంలో అలాంటి గొప్ప, అద్బుతమైన వ్యక్తిని ఇళయ రాజా రూపంలో చూశాను అని రజనీ ఎమోషనల్ అయ్యారు.

సంగీత జ్ఞాని ఇళయరాజా గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో రజనీకాంత్ ప్రసంగంచారు. అందరికి సమానంగా మ్యూజిక్ ఇస్తారని అంటారు కానీ.. ఆయన నా కంటే కమల్‌కు మంచి మ్యూజిక్ ఇచ్చాడు అని రజనీకాంత్ చమత్కరించారు. అయితే తన జీవిత చరిత్రను ఇళయరాజా రాయాలి. లేకపోతే నేను ఆయన బయోగ్రఫిని రాస్తాను. ఈ మాట సీఎం ముందే చెబుతున్నాను అని రజనీకాంత్ అన్నారు.
అయితే ఇళయరాజా ఈ సభలో మాట్లాడుతూ.. దర్శకుడు మహేంద్రన్ ఇచ్చిన పార్టీలో జరిగిన తమాషా సంఘటనను గుర్తు చేసుకొన్నారు. తాను సగం బాటిల్ బీర్ తాగి అని చెబుతూ రజనీకాంత్ వైపు చూసి.. చెప్పాలా? అని అడిగితే.. చెప్పేయండి అంటూ తలైవా తలూపాడు. దాంత బీర్ తాగి తెల్లవారు జామున 3 గంటల వరకు డ్యాన్స్ చేశామని చెబుతుంటే.. రజనీకాంత్ వచ్చి మైక్ తీసుకొని.. అసలు విషయాన్ని లీక్ చేశారు.

ఇళయరాజా బీరు సంఘటన చెబుతుంటూ.. ఉత్సాహంతో వెళ్లి మైక్ తీసుకొన్నాడు.. 1980 సంవత్సరంలో జానీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. వీజీపీ గార్డెన్‌లో షూట్ జరిగింది. ఆ సమయంలో నేను, మహేంద్రన్ మందు కొడుతున్నాం. అప్పుడు ఇళయరాజాను ఈ పార్టీకి పిలుద్దామని అన్నాడు. అందుకు నేను సరే అన్నాను. ఆ పార్టీలో సగం బీరు కొట్టి ఇళయరాజా ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌ను నా జీవితంలో మరిచిపోలేను. తెల్లవారు జామను 3 గంటల వరకు డ్యాన్స్ చేశాడు అని రజనీకాంత్ చెప్పారు.
ఆ పార్టీలో ఇళయరాజాను మహేంద్రన్ ఒక కోరిక కోరాడు. తన సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగితే.. ఆ విషయం చెప్పకుండా .. సినిమా ఇండస్ట్రీ గాసిప్స్ గురించి ఆరా తీశాడు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల గాసిప్స్ గురించి ఇళయరాజా చెప్పడం చూసి మేము షాకయ్యాం అని రజనీకాంత్ లీక్ చేశాడు. దాంతో ఆ వేడుకలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు నవ్వుల్లో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











