Rajinikanth: కూతురు దర్శకత్వంలో రజనీ కాంత్.. 'లాల్ సలామ్' అంటూ ట్వీట్

సూపర్ స్టార్ రజనీ కాంత్ ను ఆయన అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది సౌత్ హీరోలలో రజనీ కాంత్ ముందు వరుసలో ఉంటారు. రజనీ కాంత్ నటనకు, స్టైలిష్ పర్ఫామెన్స్ కు పెట్టింది పేరు. సినిమాల్లో రజనీ కాంత్ ఏం చేసినా అదొక స్టైల్.. స్టైల్ లో అతనికి అతనే సాటి అని అనుకునే వారున్నారు. అలా రజనీ కాంత్.. స్టైల్ కు మారుపేరు అయ్యారు. ఇటీవల ఆరోగ్యరీత్యా సినిమాలకు దూరంగా రజనీ కాంత్ ఇప్పుడు జోష్ పెంచారు. తాజాగా మరోక సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ఏకంగా ఆయన కుమార్తే దర్శకత్వం వహించినున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

తమిళ సంవత్సరాదికి..

తమిళ సంవత్సరాదికి..

సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ చివరిగా నటించిన చిత్రం పెద్దన్న. అయితే ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు తలైవా. ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు సూపర్ స్టార్. ప్రస్తుతం రజనీ కాంత్ జైలర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

దర్శకులపై రాని క్లారిటీ..

దర్శకులపై రాని క్లారిటీ..

జైలర్ చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవలే మరో రెండు చిత్రాలు చేసేందుకు రజనీ కాంత్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో రజనీ కాంత్ రెండు సినిమాలు చేయనున్నారు. ఈ రెండు సినిమాలు చేసేందుకు రజనీ కాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు నవంబర్ 5న అంటే ఒకే రోజున ఒకేసారి చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ రెండు చిత్రాలకు దర్శకులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. లైకా ప్రొడక్షన్స్ తో రజనీ కాంత్ ఇదివరకు రోబో 2.0 చేసిన విషయం విదితమే.

ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో..

ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో..

ఇప్పుడు రజనీకాంత్ మరో సినిమా చేయనున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా లాల్ సలామ్. ఈసినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం విశేషం.

ఇవాళ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్ మెంట్, పోస్టర్ చూస్తే క్రికేట్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యాక్షన్ డ్రామాలా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదలకు సిద్దం చేయనున్నారు.

ప్రత్యేక పాత్రలో..

అయితే ఈ సినిమాలో రజనీ కాంత్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. అంటే అతిథి పాత్రలో మాత్రమే రజనీ కాంత్ కనిపించనున్నారు. రజనీ కాంత్ కుమార్తే ఐశ్వర్యా రజనీ కాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్ మూవీలో ఆయన అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారన్నమాట. ఈ సినిమా గురించి ప్రకటిస్తూ లైకా సంస్థ ట్వీట్ చేసింది. ''ప్రతి ఒక్కరికీ లాల్ సలామ్. మా తర్వాతి ప్రాజెక్ట్ ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు" అని తెలిపింది.

ఈ చిత్రం కూడా ఒకటా..

ఇదిలా ఉంటే లైకా ప్రొడక్షన్స్ లో రజనీ కాంత్ రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని పైన చెప్పుకున్నాం. ఈ రెండు సినిమాల్లో ఈ చిత్రం కూడా ఒకటా.. లేదా ఆ రెండు చిత్రాలు వేరే ఉన్నాయా.. అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 71 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ ఫుల్ జోష్ తో సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X