»   » ‘కబాలి’ షో రద్దు చేసిన రజనీ... కారణం కమల్ హాసన్!

‘కబాలి’ షో రద్దు చేసిన రజనీ... కారణం కమల్ హాసన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల ముందే ఆయన ఈ సినిమా తన ప్రెండ్స్, సన్నిహితులకు స్పెషల్ షో చూపించాలనుకున్నారు. అయితే ఈ షోలను ఆయన ఉన్నట్టుండి రద్దు చేసారు. అందుకు కారణం.... రజనీ స్నేహితుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కాలుకు ఫ్యాక్చర్ అయి ఆసుపత్రిలో ఉండటమే.

కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ ప్లాపు సినిమాల వస్తున్న రజనీకాంత్ సినిమా ఇది. ఈ సమయంలో ఈ సినిమా హిట్ కావడం రజనీకాంత్ కు ఎంతో ముఖ్యం. దీని మీద ఆధారపడే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులు ఉంటాయి.

కమల్ హాసన్ సలహాలకు రజనీకాంత్ ఎంతో విలువనిస్తారు. వాటిని పాటిస్తారు కూడా. ఆయన సలహాల మేరకు తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే కమల్ హాసన్ ప్రస్తుతం సినిమా స్పెషల్ షోకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, స్పెషల్ షోలు రద్దు చేసారని అంటున్నారు.

34వ ఫ్యాక్చర్..
శభాష్ నాయుడు సినిమా షూటింగులో కమల్ హాసన్ కుడి కాలుకు ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే..(మిగతా వివరాలు స్లైడ్ షోలో...)

కమల్ హాసన్

కమల్ హాసన్

సినిమా షూటింగుల్లో ఇలా ఫ్యాక్చర్ కావడం కమల్ హాసన్ కు ఇది 34వ సారి.

రిస్క్ అయినా..

రిస్క్ అయినా..

రిస్కీ సన్నివేశాల్లో బాడీ డబుల్ ఉపయోగించాలని దర్శక నిర్మాతలు సూచించినా కమల్ హాసన్ తానే స్వయంగా చేయడానికి ఆసక్తి చూపుతారు. డూపులతో చేస్తే సీన్లో రియాల్టీ ఉండదనేది కమల్ హాసన్ వాదన.

కోలుకుంటున్నాడు

కోలుకుంటున్నాడు

‘ప్రస్తుతం కమల్ హాసన్ కోలుకుంటున్నాడని, త్వరలోనే తనకు తానుగా నడవగలుగుతారని డాక్టర్లు చెబుతున్నారు. మరో మరో వారంలో ఆయన్ను డిశ్చార్జి చేస్తామన్నారు. ఇ:టి వద్ద కొన్ని వారాల పాటు రెస్టు తీసుకోమని చెప్పారు' గౌతమి తెలిపారు.

తర్వాతే..

తర్వాతే..

ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత కమల్ హాసన్ ఈ సినిమా చూసే అవకాశం ఉంది.

English summary
Rajinikanth has yet again proved that his arch rival Kamal Haasan is also one of his close friends within the film fraternity as the superstar has cancelled all special shows of Kabali owing to Haasan's unfortunate leg injury.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu