»   » వీడియో: రజనీకాంత్ ఇచ్చిన షాక్‌కు 'ఓ మై గాడ్' అనేసిన పక్కింటివాళ్ళు.. సూపర్ స్టార్ అంటే ఇది!

వీడియో: రజనీకాంత్ ఇచ్చిన షాక్‌కు 'ఓ మై గాడ్' అనేసిన పక్కింటివాళ్ళు.. సూపర్ స్టార్ అంటే ఇది!

Subscribe to Filmibeat Telugu
Rajinikanth Surprises A Fan in USA

సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమిలేదు. ఆసియాలో అత్యధిక పారితోషకం ఆర్జించే నటుడు అయినప్పటికీ తలైవా సామాన్యుడిలాగే కనిపిస్తారు. హంగులు ఆర్భాటాలపై రజనీకి పెద్దగా ఆసక్తి ఉండదు. ఆఫ్ స్క్రీన్ లో ఆయన సాధారణంగా కనిపించడానికే ఇష్టపడతారు. రజని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అనడానికి ఉదాహరణగా మరో సంఘటన జరిగింది.

Rajinikanth

ఇటీవల రజనీకాంత్ మెడికల్ చెకప్ కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగా ఏకాంతగా వెళ్ళడానికి ఇష్టపడుతారు. యుఎస్ లో రోడ్లపై రజిని ఒంటరిగా వాకింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల రజిని యుఎస్ వెళ్ళినప్పుడు పక్కనే ఎన్నారైలు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లారు.

ఊహించని విధంగా రజనీకాంత్ తమ ఇంటి ముందు కనిపించడంతో వారు ఆశ్చర్యంలో మునిపోయారు. రజనీకాంతే స్వయంగా లోపలి రావచ్చా అని అడగడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోయి రజనీని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఎన్నారై కుటుంబ సభ్యులతో రజనీకాంత్ సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Rajinikanth surprise visit to Neighbor's house in USA. One more example for Rajinikanth simplicity
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X