»   » మీ హీరో ఏం పీకలేక పోయాడుగా..... ఆ ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య మళ్లీ ఫైట్!

మీ హీరో ఏం పీకలేక పోయాడుగా..... ఆ ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య మళ్లీ ఫైట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Fans Overaction...! మీ హీరో ఏం పీకలేక పోయాడుగా..!

ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు బేషజాలకు పోయి గొడవలు పడటం లాంటి సంస్కృతి ఇప్పటిది కాదు. మొన్నటితరం స్టార్ హీరోల నుండి నేటి తరం స్టార్ హీరోల వరకు అది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాదిన.... తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇదీ మరీ ఎక్కువ. ఇక సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిన తర్వాత ఈ జాడ్యం మరింత విస్తరించింది. తాజాగా రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్ మొదలైంది.

 కారణం ఏమిటంటే...

కారణం ఏమిటంటే...

తమిళ స్టార్ విజయ్ నటించిన ‘మెర్సల్' మూవీ టీజర్ అప్పట్లో తమిళ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే ఈ రోజు(మార్చి 2)న విడుదలైన రజనీకాంత్ ‘కాలా' టీజర్ ‘మెర్సల్' రికార్డు దరిదాపుల్లో కూడా లేక పోవడంతో..... విజయ్ అభిమానులు ఓవరాక్షన్ మొదలు పెట్టారు. దీంతో గొడవ మొదలైంది.

రజనీ అభిమానులను రెచ్చగొట్టిన వైనం

రజనీ అభిమానులను రెచ్చగొట్టిన వైనం

సోషల్ మీడియాలో ఈ వివాదానికి తెరలేపింది మొదట విజయ్ అభిమానులే అని టాక్. మీ హీరో ఏం పీకలేక పోయాడుగా అని అర్థం వచ్చేలా.... అంటూ కొందరు కామెంట్స్ చేయడంతో రజనీకాంత్ అభిమానులు ఎదురుదాడి ప్రారంభించారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

‘కాలా' టీజర్ రీచ్ ఎలా ఉందంటే...

‘కాలా' టీజర్ రీచ్ ఎలా ఉందంటే...

అప్పట్లో ‘మెర్సల్' టీజర్ విడుదలైన 10 నిమిషాల్లోనే యూట్యూబ్‌లో లక్ష లైకులు సొంతం చేసుకుంది. తొలి గంటలో రికార్డు స్థాయిలో 4 లక్షల లైక్స్ సాధించింది. తొలి 5 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్, 6 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విడుదలైన ‘కాలా' టీజర్ 11 గంటల్లో కేవలం 2.7 మిలియన్ వ్యూస్, 2.3 లక్షల వ్యూస్ దక్కించుకుని చాలా వెనకబడిపోయింది.

లీక్ ఎఫెక్ట్ బాగా పడింది

లీక్ ఎఫెక్ట్ బాగా పడింది

‘కాలా' టీజర్ కొన్ని రోజుల ముందే లీక్ అయింది. వాట్సాప్, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఆ ఎఫెక్ట్ బాగా పడింది. అందుకే ఇపుడు విడుదలైన ‘కాలా' టీజర్ అనుకున్న రెస్పాన్స్ రావడం లేదని, లేక పోతే రజనీకాంత్ స్థాయికి ‘మెర్సల్' రికారక్డు బద్దలయి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.

మా హీరోనే ఇపుడు సూపర్ స్టార్.... విజయ్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్

మా హీరోనే ఇపుడు సూపర్ స్టార్.... విజయ్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్

ఇప్పటి వరకు తమిళనాడులో సూపర్ స్టార్ అంటే రజనీకాంతే. అయితే విజయ్ అభిమానులు ‘మెర్సల్', ‘కాలా' టీజర్ లైక్స్, హిట్స్ కంపేర్ చేస్తూ ఇపుడు తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు, విజయ్ అంటూ వితండవాదం చేస్తూ ఓవరాక్షన్ మొదలు పెట్టడంతో...... రజనీకాంత్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

అంచనాలు పెంచిన ‘కాలా'

అంచనాలు పెంచిన ‘కాలా'

ఆ గొడవ పక్కన పెడితే.... 1.17 నిమిషా నిడివిగల ‘కాలా' టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. గతంలో రజనీతో ‘కబాలి' చిత్రం చేసిన పా రంజిత్..... రజనీని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రజంట్ చేశాడని అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం రజనీకాంత్ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈచిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Afret Kaala teaser released... Rajinikanth-Vijay fans fight it out on social media. Since its release, the fans have been keeping a close eye on the number of likes and hits on YouTube and comparing it with another blockbuster Mersal starring Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu