»   » మై గాడ్.. కమల్ హాసన్‌తో గొడవలా.. ఆశ్చర్యపోయిన రజని!

మై గాడ్.. కమల్ హాసన్‌తో గొడవలా.. ఆశ్చర్యపోయిన రజని!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సూపర్ స్టార్ రజనికాంత్ 2.0 విడుదల తరువాత ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలలో 2.0 చిత్ర విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు, రాజకీయాలు గురించి మాట్లాడారు. గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2.0 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. భారత చలన చిత్ర రంగంలో గర్వించదగా చిత్రం 2.0 అని అటు ప్రేక్షకుల నుంచి, సినీప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా రజని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ తో ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  కమల్ నాకు విరోధా

  కమల్ నాకు విరోధా

  కమల్ హాసన్ తో మీ రిలేషన్ ఎలా ఉంది.. మీరిద్దరూ కొన్ని విషయాలలో విరోధులుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు రజని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మై గాడ్.. కమల్, నేను విరోధులమా.. ఏమాత్రం కాదు. ఆ మాటకు వస్తే కమల్ కమల్ నాకు మంచి స్నేహితుడు అని రజని అన్నారు. కనీసం అతడికి నాకు మధ్య పోటీ ఉందని కూడా నేను చెప్పను అని రజని పేర్కొన్నారు.

  అతడి వద్దే డైలాగులు

  అతడి వద్దే డైలాగులు

  తాను కెరీర్ ఆరంభంలో అతడివద్దే డైలాగ్ ఎవరీ ఎలా ఉండాలో నేర్చుకున్నాని రజని అన్నారు. కొన్ని సార్లు కమల్ నాకోసం తన డేట్స్ సర్దుబాటు చేసుకునేవారు అని కూడా రజని గుర్తు చేశారు. కెరీర్ ఆరంభంలో రజని, కమల్ కొన్ని చిత్రాల్లో కలసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

  విడదీయాలని చూసేవాళ్ళు

  విడదీయాలని చూసేవాళ్ళు

  మేమిద్దరం కలిసే సినీ కెరీర్ ని ప్రారంభించాం. ఆరంభం నుంచి మంచి స్నేహతులుగా ఉన్నాము. ఇండస్ట్రీ గురించి మాకు తెలుసు. మా ఇద్దరి స్నేహాన్ని చెడగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అలాంటి పట్ల తాము జాగ్రత్తగా ఉన్నామని రజని తెలిపారు. కమల్ హాసన్ నటించిన అపూర్వ రాగంగాళ్ చిత్రంతో రజని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  రాజకీయాల్లో

  రాజకీయాల్లో

  రజనీకాంత్ ఈ ఏడాది ఆరంభంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కూడా సొంతంగా పార్టీ స్థాపించారు. వీరిద్దరి రాజకీయ ప్రయాణంపై తమిళనాడు వ్యాప్తంగా ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది.

  English summary
  Rajinikanth vs Kamal Haasan: Rivalry or friendship? The answer, straight from Thalaivar. Rajinikanth and Kamal Haasan are two of the biggest stars in South Indian cinema. They do not consider each other as contemporary rivals but are the best of friends.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more