»   » ‘లైకా’కు రాజీనామా... రజనీ పార్టీలోకి మహాలింగం, అదే దారిలో లారెన్స్!

‘లైకా’కు రాజీనామా... రజనీ పార్టీలోకి మహాలింగం, అదే దారిలో లారెన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీని స్థాపిస్తానని ఆయన ఇటీవల అభిమానుల సమావేశంలో చారిత్రాత్మక ప్రకటన చేశారు. రజనీకాంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రజనీకాంత్ పార్టీలో చేరడానికి సిద్దమయ్యారు.

‘లైకా'కు రాజీనామా చేసిన రాజు మహాలింగం

‘లైకా'కు రాజీనామా చేసిన రాజు మహాలింగం

ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ, రూ. 400 కోట్ల వ్యయంతో రజనీకాంత్ మూవీ 2.0 చిత్రాన్ని తెరకెక్కించిన ‘లైకా ప్రొడక్షన్స్'లో క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజు మహలింగం తన పదవికి రాజీనామా చేశారని, రజనీకాంత్ పార్టీలో చేరుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన పదవికి ఇంకా రాజీనామా చేయలేదని లైకా వర్గాలు తెలిపారు. 2.0 మూవీ విడుదలయ్యే వరకు అతడు రాజీనామా చేయబోడని టాక్.

 రజనీకాంత్ బంటుగా ఉంటానన్న

రజనీకాంత్ బంటుగా ఉంటానన్న

రాజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించగానే ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన మద్దతు ప్రకటించారు. రజనీకాంత్ బంటుగా ఉండేందుకు తాను సిద్ధమని తెలిపారు. జనవరి 7న మధురైలో ఈ విషయమై తాను అఫీషియల్ ప్రకటన చేస్తానన్నారు.

 మరికొందరు స్టార్లు కూడా

మరికొందరు స్టార్లు కూడా

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై తమిళనాడులో మెజారిటీ పీపుల్ సపోర్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మరికొందరు సినీ స్టార్లు, ప్రజలు అందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 రజనీకాంత్ వ్యక్తిత్వమే ఆయన బలం

రజనీకాంత్ వ్యక్తిత్వమే ఆయన బలం

తమిళ వ్యక్తి కాక పోయినా, ప్రతి తమిళుడు అభిమానించి, ఆరాధించే స్థాయికి రజనీ రావడానికి కారణం.... కేవలం ఆయన సినిమాలు అనుకుంటే పొరపాటే. రజనీకాంత్ వ్యక్తిత్వం, సేవాగుణం, మంచితనం, నిజాయితీ ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇపుడు అదే నిజయితీతో దాన్నే కొండంత బలంగా చూసుకుని రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు.

 తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం

తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం

రజనీకాంత్ ముందు నుండీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తమిళనాడులో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం, ప్రజలు మరింత కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో.... తనను ఆదరించి, అభిమానించి ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు సూపర్ స్టార్.

 భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు

భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు

ప్రస్తుతం రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదించడం, పదవులు పొందడం,పేరు సంపాదించడం లాంటి స్వార్థపూరిత ఆలోచనలో నిండిపోయాయి. అయితే తనకు అవేవీ అవసరం లేదని, తనకు ఆల్రెడీ అవన్నీ ఉన్నాయని..... భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీకాంత్ తెలిపారు.

 రాజకీయ దోపీడీ అరికట్టడమే లక్ష్యంగా

రాజకీయ దోపీడీ అరికట్టడమే లక్ష్యంగా

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజలను దోచుకునే విధంగా ఉన్నాయని, ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పరిస్థితులను చూసి ఇతర రాష్ట్రాలు హేళన చేస్తున్నారని, ఈ సమయంలో తాను రాజకీయ నిర్ణయం తీసుకోకుంటే తప్పు చేసిన వాడిని అవుతానని రజనీకాంత్ అన్నారు.

 నిజం, పని, అభివృద్ధి అనే ముఖ్య సూత్రాలతో

నిజం, పని, అభివృద్ధి అనే ముఖ్య సూత్రాలతో

తాను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంటే మూడేళ్లలోనే రాజీనామా చేస్తానని రజనీకాంత్ ప్రకటించారు.

English summary
Lyca's Raju Mahalingam, actor Raghava Lawrence to join Rajini's political party. While Lawrence has called himself Rajini's 'Kaavalan', Raju has resigned from Lyca Productions in order to join Rajini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X