For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jayaraj, Fenix deaths: మనుషుల్లో మానవత్వం ఉందా? రకుల్, కియారా, తాప్సీ ఫైర్

  |

  లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్దంగా మొబైల్ షాపు తెరిచారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసిన పీ జయరాజ్, అతడి కుమారుడు ఫెనిక్స్ ఇద్దరూ తమిళనాడులోని తుతుకుడి జిల్లా కోవిల్‌పట్టి హాస్పిటల్‌లో మరణించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అమానవీయ ఘటనపై ప్రముఖులు, సినీ తారలు నిరసన వ్యక్తం చేస్తూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. #JusticeforJayarajAndFenix అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఇంతకు ఈ ఘటనలో ఏం జరిగిందంటే..

  #JusticeforJayarajAndFenix : మనుషుల్లో మానవత్వం ఉందా ? Jayaraj & Fenix ఘటనపై సినీ తారలు నిరసన!
  జయరాజ్, ఫినిక్స్ మరణాల వెనుక

  జయరాజ్, ఫినిక్స్ మరణాల వెనుక

  జూన్ 19న తేదీన ట్యుటికోరిన్‌లోని తమ మొబైల్ షాపును పి జయరాజ్ యజమాని లాక్‌డౌన్ సమయాన్ని మించి 15 నిమిషాలపాటు ఎక్కువసేపు తెరిచారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో జయరాజ్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి జయరాజ్‌ అరెస్ట్ గురించి తెలుసుకొన్న కుమారుడు ఫెనిక్స్ ఇమ్మాన్యుయేల్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి అరెస్ట్‌ గురించి ఆరా తీశారు. అక్కడ పోలీసులతో వాదన జరగడంతో కొడుకు ఫెనిక్స్‌ను కూడా లాక్‌లో వేశారు. శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు లాకప్‌లో ఏం జరిగిందో తెలియదు గానీ తండ్రి కొడుకులు మరణించారు. కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. రెండు రోజుల్లో రక్తపు మరకలు అంటడంతో పలు మార్లు దుస్తులు మార్చారనే ఆరోపణ వినిపిస్తున్నది. ఈ దారుణ ఘటనపై తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ తారలందరూ ముక్తకంఠంతో ఎండగడుతున్నారు.

   రకుల్ ప్రీత్ స్పందిస్తూ..

  రకుల్ ప్రీత్ స్పందిస్తూ..

  ట్యుటికోరిన్ దారుణ ఘటనపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ఆ వార్త విని గుండె ముక్కలైనంత పని అయింది. ఇద్దరి లాకప్‌డెత్ తీవ్రంగా కలత చెందాను. ఇలాంటి దారుణాన్ని చూస్తే మానవత్వం ఉందా అనిపిస్తుంది. ఇలా ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఇలాంటి సంఘటన చూసిన తర్వాత కడుపు రగిలిపోతున్నది. కుటుంబ సభ్యుల పరిస్థితి తలచుకొంటే గుండె తరుక్కుపోతున్నది. ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోవద్దు. జయరాజ్, ఫినిక్స్ కుటుంబాలకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

  మర్డర్ కేసు పెట్టాలని సుచిత్ర డిమాండ్

  మర్డర్ కేసు పెట్టాలని సుచిత్ర డిమాండ్

  జయరాజ్, ఫినిక్స్ మరణంలో ఏం జరిగిందనేది బయటకు రావాలి. వాళ్లు లాకప్‌లో మరణించారా లేదా అనే విషయాన్ని బయటపెట్టాలి. పోలీసులపై మర్డర్ కేసు పెట్టాలి. వెంటనే మెజిస్ట్రేరియల్ విచారణ చేయాలి. లోపాలు లేకుండా సరైన దర్యాప్తు చేయాలి అంటూ సుచిత్ర డిమాండ్ చేశారు.

  తాప్సీ ఆగ్రహం

  తాప్సీ ఆగ్రహం

  జయరాజ్, ఫినిక్స్ కేసే కాదు.. చాలా కేసుల్లో ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. జయరాజ్, ఫినిక్స్‌కు న్యాయం జరగాలి. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ సంఘటన మాత్రం భయానికి గురిచేస్తున్నది. అత్యంత బాధ కలిగిస్తున్నది అని తాప్సీ పన్ను ట్వీట్ చేశారు.

  కియారా అద్వానీ ఆవేదన

  కియారా అద్వానీ ఆవేదన

  జయరాజ్, ఫినిక్స్ మరణాల ఘటనపై కియారా అద్వానీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఘటన మానవీయ విలువలను మంటగలిపే విధంగా ఉంది. చాలా దారుణమైన ఘటన. జయరాజ్, ఫినిక్స్‌ కుటుంబాలకు న్యాయం జరగాలి అంటూ కియారా ట్వీట్‌లో పేర్కొన్నారు.

  రితికా సింగ్ ఎమోషనల్‌గా

  రితికా సింగ్ ఎమోషనల్‌గా

  జయరాజ్, ఫినిక్స్ ఘటనపై మరో హీరోయిన రితికా సింగ్ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యారు. ఇద్దరి ఆత్మలకు శాంతి కలగాలి. జయరాజ్,ఫినిక్స్ జరిగినది చాలా దారుణం. అత్యంత దయనీయం. హృదయం ముక్కలైనంతగా బాధ ఉంది. చాలా రోజుల తర్వాత దారుణమైన విషయం గురించి ఇలా వినడం, చదవాల్సి రావడం బాధను కలిగిస్తున్నది అని రితికా సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  English summary
  Film Herione Rakul Preet singh, Kiara Advani, Tapsee pannu reacts P Jayaraj and his son Fenix deaths. Rakul tweeted that This is heartbreaking .I am disgusted. This kind of brutality is inhuman and no one has the right to treat another life in this manner .Makes me sick to the stomach. Strength to the family members of the deceased .This should not be tolerated. I demand #JusticeforJayarajAndFenix.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X