»   » 'రా' ఏజెంట్ గా రామ్ చరణ్ ? రచ్చ చేసే క్యారక్టర్ తో దుమ్ము రేపబోతున్నాడు

'రా' ఏజెంట్ గా రామ్ చరణ్ ? రచ్చ చేసే క్యారక్టర్ తో దుమ్ము రేపబోతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా ధృవ చిత్రంలో స్టైలిష్ పోలీస్ అధికారిగా కనిపించిన రామ్ చరణ్ త్వరలో రా ఏజెంట్ గా కనిపించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అబ్బబ్బే ....ఈ వార్త సుకుమార్, రామ్ చరణ్ సినిమా గురించి కాదండోయ్. మరి ఇంకే సినిమా గురించి న్యూస్. ప్రస్తుతం జరుగుతుంది అదే కదా అంటారా. ప్రస్తుతం జరగుతోంది అదే కావచ్చు. కానీ మేం చెప్పబోయేది రామ్ చరణ్ తర్వాత చేయబోయే చిత్రంలోని క్యారక్టర్ గురించి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కే అవకాసం ఉందంటూ చాలా కాలంగా వార్తలు విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్టు సమాచారం. ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చి, రామ్ చరణ్ నుంచి, చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది.

Ram Charan as RAW agent in Mani Ratnam's movie?

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ రా..ఏజెంట్ గా కనిపించనున్నారు. దేశాన్ని ఇబ్బంది పెట్టే విలన్స్ స్కెచ్ ని బయిట పెట్టే ఓ టాస్క్ పై పనిచేసే అధికారిగా ఆయన కనిపించనున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇదంతా కేవలం తమిళ సినీ సర్కిల్స్ లో వినపడుతున్న విషయాలే .

ప్రస్తుతం మణిరత్నం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణి ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మణి కాంబినేషన్‌లో చిత్రం ఉండబోతోంది. జూన్ నుంచి మణిరత్నానికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మణిరత్నం టీమ్ ఈ కొత్త కాంబో చిత్రానికి లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తున్నారని వినికిడి. తమిళ,తెలుగు,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుని సుహాసిని ప్రపోజల్ తో ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

ధృవ సినిమా తనను ఎ సెంటర్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెర్రీ భావించి చేసారు. దీనికి కంటిన్యూషన్ గా మణిరత్నం సినిమా చేస్తే, ఆ మార్కెట్ ను పదిలం చేసుకోవచ్చు అనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే సుక్కు సినిమా తరువాతి సినిమాకు డైరక్షన్ మణిరత్నమే అని ఫిక్స్ అయిపోయాడట. పైగా బన్నీ ఎలాగూ తమిళ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ కు కూడా ఈ ప్రాజెక్టుతో అక్కడ పరిచయం అయినట్లు వుంటుందని కూడా ఆలోచిస్తున్నారట.

అంతాబాగానే ఉంది మరి ఈ చిత్రం ఎప్పటిలా మణిరత్నం స్కూల్ లో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ సాగుతుందా లేక ప్రయోగాలకు తావు లేకుండా చేయడంలో చెర్రీ స్కీమ్ లోకి వచ్చేసి చేస్తారా ఈ రెండు కాక...మిక్స్ చేసి క్లాస్ , మాస్ కలిపి సినిమా అందిస్తారా అనేది చూడాల్సి ఉంది.

English summary
Mani Rathnam has already begun pre-production work for his next movie with Ram Charan. As per the latest buzz, in this film Charan is tipped to play an intelligence RAW agent who accomplishes a tough mission.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu