twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెయిల్స్, ఎస్ ఎం.ఎస్ ల ద్వారా రోబో అసలు కథ తెలిసిపోయిందోచ్...!?

    By Sindhu
    |

    ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'రోబో". ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్, జీనియస్ డైరెక్టర్ శంకర్, ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు భారీగా వున్నాయి. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రోబో స్టోరీ ఇటీవల లీకైంది. మెయిల్స్, ఎస్ ఎం.ఎస్ ల ద్వారా ఈ కథ అందరికీ తెలిసిపోతుంది.

    ఇక రోబో కథ విషయానికి వస్తే 'వసిగారన్(రజనీకాంత్)అనే సైంటిస్ట్ అహోరాత్రులు శ్రమించి పూర్తి సాంకేతిక పరిజ్ఝానంతో ఓ రోబోని తయారు చేస్తాడు. ఆ రోబో లో సిక్త్స్ సెన్స్ కూడా వుంటుంది. అయితే ఒక టైంలో తన సష్టికర్త అయిన సైంటిస్ట్ కే ఎదురు తిరిగి మానవాళిపై దాడికి దిగుతుంది రోబో. కాగా ఆ రోబోని తన అందచందాలతో, ఆకర్షణతో కట్టిపడేసి దాన్ని వినాశనం చేయడంలో సైంటిస్ట్ కి సహాయపడే పాత్ర ఐశ్వర్య రాయ్ ది. ఫైనల్ గా రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటంటే సినిమా అంతా అందంగా ఆకర్షణీయంగా కనిపించిన ఐశ్వర్య రాయ్ కూడా ఓ రోబోయేనని. విలన్ గా మారిన తన రోబోని అంతం చేయటానికి ఆ సైంటిస్ట్ ఐష్ ని క్రియేట్ చేసాడని ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమా ముగుస్తుంది.

    సో ఇది రోబో స్టొరీ ఇక శంకర్ విజువల్ ట్రీట్ తో ఈ చిత్రం ఎంత అద్భుతంగా తెరకేక్కిందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X