»   » అసిన్ తల్లి పాత్రలో సీనియర్ నటి రోజా

అసిన్ తల్లి పాత్రలో సీనియర్ నటి రోజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాలిటిక్స్ లో బిజీ తగ్గిన సీనియర్ నటి రోజా త్వరలో అసిన్ కి అమ్మగా నటించనుంది. మళయాళ సూపర్ హిట్ బాడీగార్డ్ రీమేక్ గా తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ హీరోగా చేస్తున్నారు. అతని అత్తగా రోజా నటిస్తోంది. ఈ చిత్రానికి కావాలకరన్ అనే టైటిల్ పెట్టారు. మళయాళంలో చేసిన దర్శకుడు సిద్దిక్ ఈ తమిళ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ఈ చిత్రంతో తల్లి, అత్త పాత్రలకు రోజాకి పూర్తి డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇంతకుముందు తమిళ చిత్రం నాడోడిగల్ ఆధారంగా రూపొందిన శంభో శివ శంబో చిత్రంలోనూ ఆమె తల్లి పాత్ర చేసింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరక్ట్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu