»   » బిగ్ బాస్: కమల్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు, ఎన్టీఆర్ అలర్ట్!

బిగ్ బాస్: కమల్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు, ఎన్టీఆర్ అలర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో బిగ్ బాస్ రియాల్టీషో హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ మీద రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. బిగ్‌బాస్‌లో తమిళ సంస్కృతీ సాంప్రదాయాలను అవమానించారని ఆరోపిస్తూ ఈ దావా దాఖలైంది.

'పుతియ తమిళగం' అనే తమిళ సంస్థ నాయకుడు కృష్ణ మూర్తి ఈ పిటీషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోలో తమిళ ప్రజలను అవమానించే విధంగా కామెంట్ చేశారంటూ ఈ దావా వేశారు.

అసలు కారణం ఎవరు?

అసలు కారణం ఎవరు?

కమల్ హాసన్ మీద రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు కావడానికి ప్రధాన కారణం.... తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలో పోటీదారు గాయత్రి రఘురామ్ చేసిన కామెంట్స్. ఆమె వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి.

Bigg Boss Telugu : Madhupriya And Sampoornesh Babu Nominated by many for Elimination
ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్?

ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్?

తమిళ పేద ప్రజల గురించి గాయత్రి రఘురామ్ అవమానకర వ్యాఖ్యలు చేశారని, దీని కారణంగా తమిళుల మనోభావాలు దెబ్బతిన్నాయని కృష్ణ మూర్తి ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా

గతంలో కూడా

కృష్ణ మూర్తి గతంలో కూడా కమల్ హాసన్‌తో ఓ సినిమా టైటిల్ విషయంలో ఫైట్ చేశారు. కమల్ హాసన్ నటించిన సినిమాకు ‘సందియార్' అనే టైటిల్ పెట్టడం వివాదం అయింది. దీంతో తర్వాత ఆ టైటిల్‌ను ‘విరుమండి'గా మార్చారు.

ఎన్టీఆర్ అలర్ట్

ఎన్టీఆర్ అలర్ట్

తమిళనాడులో ‘బిగ్ బాస్' షో వివాదాల నేపథ్యంలో..... తెలుగులో ‘బిగ్ బాస్' షో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ కాస్త అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, తెలుగులో ఎలాంటి వివాదాలు లేకుండా షో హోస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

English summary
Puthiya Tamizhagam leader Krishnasamy has filed RS 100cr defamation case against Kamal Haasan for a derogatory comment made by Gayathri Raghuram, one of the contestants in the actor’s reality show ‘Bigg Boss’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu