»   » అనుష్క ఒప్పుకోలేదట.. వస్త్రాపహరణకు సిద్ధపడుతున్న నయనతార!

అనుష్క ఒప్పుకోలేదట.. వస్త్రాపహరణకు సిద్ధపడుతున్న నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీరామరాజ్యం, దోర లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించిన నయనతారను మరో అరుదైన పాత్ర వెతుక్కొంటు వచ్చింది. బాహుబలి స్ఫూర్తిగా కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కురుక్షేత్ర చిత్రంలో నయనతార ద్రౌపదిగా కనిపించనున్నారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ఇమైక్క నోడిగల్ అనే చిత్రంలో నటిస్తున్నది. కురుక్షేత్ర సినిమాకు సంబంధించి చెప్పుకుంటే చాలా విశేషాలు వెల్లడవుతున్నాయి.

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార

తెలుగులో బాలకృష్ణ, దర్శకుడు బాపు కాంబినేషన్‌లో తెరకెక్కిన శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార సీతగా నటించి మెప్పించింది. ఆ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన నయనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది. తాజాగా కన్నడ దర్శకుడు నాగన్న దర్శకత్వం వహించే కురుక్షేత్రలో ద్రౌపదిగా నటించే అవకాశం లభించింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ చిత్రం జూలై 23న సెట్స్‌పైకి వెళ్లనున్నది.

గతంలో నయన సూపర్

గతంలో నయన సూపర్

గతంలో కన్నడ చిత్రంలో నటించిన అనుభవం నయనతారకు ఉంది. దర్శకుడు ఉప్పీ రూపొందించిన సూపర్ చిత్రంలో నటించింది. భావోద్వేగమైన పాత్రల్లో నటిస్తున్న నయనతారే ద్రౌపది పాత్రకు కరెక్ట్ అని చిత్ర నిర్మాతలు భావించారట. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నయనతారకు మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ అవకాశం దక్కింది.

ద్రౌపదిగా చేయలేనన్న అనుష్క

ద్రౌపదిగా చేయలేనన్న అనుష్క

తొలుత ద్రౌపది పాత్ర కోసం దేవసేన అనుష్కను సంప్రదించారట. అయితే ఆమె సానుకూలంగా స్పందించకపోవడంతో నయనతారను తీసుకోవడం జరిగిందనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా అనుష్క శెట్టి కర్ణాటకకు చెందినది కావడంతో ఆమెను నటింపజేయాలని నిర్మాత మునిరత్నం తీవ్రంగా ప్రయత్నించారట. అయితే ఎందుకో ఆ పాత్రపై అనుష్క్ ఆసక్తి చూపలేదనేది తాజా సమాచారం.

ధుర్యోధనుడిగా నటుడు దర్శన్

ధుర్యోధనుడిగా నటుడు దర్శన్

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న కురుక్షేత్ర చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ దర్శన్ ధుర్యోధనుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం దర్శన్‌కు కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం. వీ రవిచంద్రన్ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో కర్ణుడు, భీముడు పాత్రలను ఎవరు పోషిస్తున్నారనే విషయం కన్నడ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Latest reports suggest that, Nayanthara is playing the iconic character, Draupadi, in the forthcoming Kannada film Kurushetra. Earlier, Nayanthara was honoured with the Filmfare Award for Best Actor (Female) for playing Goddess Sita in the Telugu film, Sri Rama Rajyam. Directed by Naganna, Kurukshetra is said to go on floors on July 23 this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X