Don't Miss!
- News
'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
వర్థమాన నటుడి మృతిపై రూమర్లు.. రంగంలోకి అధికారులు, వైద్యులు.. ఏం జరిగిందంటే!
ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండే నటుడు, డాక్టర్ సేతురామన్ మృతితో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. తమిళ నటుడు సంతానంకు అత్యంత సన్నిహితుడైన సేతురామన్ మార్చి 26వ తేదీ రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై తమిళ మీడియాలో రూమర్లు చెలరేగాయి. దాంతో ఆయన మరణం మీడియాలో వివాదాస్పదంగా మారడమే కాకుండా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిచింది. దాంతో కుటుంబ సభ్యులు, అధికారులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

కరోనా వైరస్‌తోనే అంటూ
సేతురామన్ మృతివార్తతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోతే.. మరోపక్క ఆయన కరోనావైరస్‌తో మరణించారనే వార్త సోషల్ మీడియాలో దావానలంగా వ్యాపించింది. దాంతో సినీ ప్రముఖులు ఓ రకమైన షాక్ గురయ్యారు. వెంటనే వైద్యుల సహకారంతో వివరణ ఇప్పించడంతో రూమర్లకు బ్రేక్ పడింది.

అధికారులు, వైద్యుల వివరణ
సేతురామన్
మృతిపై
అధికారులు,
కుటుంబ
సభ్యులు
స్పందించారు.
ఆయన
మరణం
కేవలం
గుండెపోటు
కారణంగానే
జరిగింది.
అంతేకానీ
సోషల్
మీడియాలో
వస్తున్న
ఊహాగానాలు,
రూమర్లకు
సంబంధం
లేదు.
ఆయనపై
వస్తున్న
రూమర్లలో
వాస్తవం
లేదు
అని
వివరణ
ఇచ్చారు.

డాక్టర్ అశ్విన్ విజయ్ స్పందిస్తూ
సేతురామన్
మరణంపై
డాక్టర్
అశ్విన్
విజయ్
స్పందిస్తూ..
సేతు
నీవు
లేని
నా
జీవితం
చాలా
దుర్భరంగా
ఉంటుంది.
నా
జీవితంలో
చాలా
బాధకరమైన
రోజు.
మన
30
ఏళ్ల
స్నేహం,
సోదరభావాన్ని
ఒక్కవేటుతో
తుంచి
పడేశావు.
మన
విజన్,
ఆశయాలను
తుంగలో
తొక్కి
వెశ్లిపోయావు.
నీవు
లేని
నా
జీవితం
అసంతృప్తిగానే
మిగిలిపోతుంది.
నా
స్నేహితుడు
కరోనా
కారణంగా
చనిపోలేదు.
గుండెపోటుతోనే
మరణించాడు
అని
చెప్పారు.

కంటతడి పెట్టిన సంతానం
తన
స్నేహితుడు
సేతురామన్
మృతితో
నటుడు
సంతానం
తీవ్ర
విషాదంలో
మునిగిపోయాడు.
కరోనా
పరిస్థితుల
నేపథ్యంలో
కూడా
అంత్యక్రియలకు
హాజరకావడంతోపాటు
దగ్గరుండి
కార్యక్రమాలు
పూర్తి
చేశాడు.
తన
స్నేహితుడు
పాడే
మోస్తూ
కంటతడి
పెట్టారు.
సేతురామన్
మృతిపై
వివేక్,
కుష్బూ
తదితరులు
తీవ్ర
విచారం
వ్యక్తం
చేశారు.

డాక్టర్, సినీ యాక్టర్‌గా
సేతురామన్
వృత్తిరీత్యా
చర్మవ్యాధి
నిపుణులు.
డాక్టర్‌గా
సేవలందిస్తూనే
నటుడిగా
పలు
చిత్రాల్లో
నటించి
మెప్పించారు.
ఆయన
వయసు
36
సంవత్సరాలు.
ఆయనకు
భార్య
ఉమాయల్,
ఏడాది
వయసున్న
కూతురు
ఉన్నారు.
సేతురామన్
ఆకస్మిక
మృతితో
కుటుంబ
సభ్యులు
శోక
సంద్రంలో
మునిగిపోయారు.
Recommended Video
|
స్నేహితుడు డాక్టర్ విజయ్ ఎమోషనల్‌గా
సేతు
మరణంపై
డాక్టర్
అశ్విన్
విజయ్
ఎమోషనల్
సందేశాన్ని
తన
ఇన్స్‌టాగ్రామ్‌లో
పోస్టు
చేశాడు.
నీతో
ఎన్నో
ఫోటోలు
దిగాను.
కానీ
ఎప్పుడు
బయటపెట్టలేదు.
ఇటీవల
దిగిన
ఈ
ఫోటోను
తొలిసారి
పోస్టు
చేశాను.
నా
బర్త్
డే
మార్చి
26న,
కరోనా
కారణంగా
నా
కోసం
కేక్‌కు
బదులు
బన్
తెస్తున్నానని
చెప్పావు.
మరో
పుట్టిన
రోజు
వరకు
నా
జీవితం
ఎలా
ఉంటుందో
కనీసం
ఊహించావా?
అంటూ
అశ్విన్
విజయ్
ఓ
పోస్టు
పెట్టారు.