»   » వేశ్యపాత్ర చేయటానికి సిద్దపడింది: ఈ వయసులో మళ్ళీ సక్సెస్ సాధ్యమేనా??

వేశ్యపాత్ర చేయటానికి సిద్దపడింది: ఈ వయసులో మళ్ళీ సక్సెస్ సాధ్యమేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నేళ్ల క్రితం హోమ్లీ, గ్లామరస్‌ పాత్రలతో మెప్పించిన సదా ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతోంది.అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు, రియాలిటీ షోలలో జడ్జిగా కనిపిస్తూ ఏదోలా కెరీర్ బండిని లాక్కొస్తున్న ఈ ముదురు భామకు రీసెంట్‌గా కోలీవుడ్‌లో చాన్స్ రావడం విశేషం. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం 'టార్చ్‌లైట్‌'.

1980ల నాటి నేపథ్యంతో

1980ల నాటి నేపథ్యంతో

1980ల నాటి నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటీనటులు ధరించే దస్తులు, లొకేషన్లు అన్నీ ఆనాటి వాతావరణానికి తగ్గట్టే ఉంటాయట. ఇందులో సదా వేశ్య పాత్రలో నటిస్తుండగా, ఆమె ఆహార్యం కూడా వైవిధ్యంగా ఉండబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.


ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది?

ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది?

తిరునల్వేలి, కుట్రాలం పరిసరాల్లో గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. జీవితంపై ఎన్నో కలలు ఉన్న ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న కథతో దర్శకుడు మజీద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేశ్య పాత్రలో నటించేందుకు మొదట సంశయించినా దర్శకుడు చెప్పిన కథ విన్నాక కళ్లలో నీళ్లు తిరిగాయని, వెంటనే ఓకే చెప్పేశానని సదా చెబుతోంది.


కోలీవుడ్ దూరం పెట్టింది

కోలీవుడ్ దూరం పెట్టింది

రెండేళ్ల క్రితం వడివేలు హీరోగా నటించిన ‘ఎలి' సినిమాలో అతడి సరసన నటించిన సదాను కోలీవుడ్ దూరం పెట్టింది. వడివేలు సరసన నటించిన హీరోయిన్‌తో నటించడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. కోలీవుడ్‌లోని హీరోలెవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. ఆ తరువాత రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించినా అవి కూడా బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో తెరకెక్కే ‘టార్చ్ లైట్' రిజల్ట్ కీలకం కానుందని ప్రచారం జరుగుతోంది.


ఇమేజ్‌ దెబ్బతింటుందని

ఇమేజ్‌ దెబ్బతింటుందని

ఈ కథను చాలామంది నటీమణులకు చెప్పగా నటించడానికి నిరాకరించారని, తమ ఇమేజ్‌ దెబ్బతింటుందని భయపడ్డారని చెప్పారు చిత్ర డైరెక్టర్ అబ్దుల్‌ మజీద్‌. చివరికి నటి సదాను వెతుక్కుంటూ వెళ్లి కథ చెప్పగా ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటిస్తానని అన్నారని తెలిపారు.


ఎంత చేసినా ఈ వయసులో

ఎంత చేసినా ఈ వయసులో

ఈ చిత్రంలో ఉదయ్‌ అనే నూతన నటుడు హీరోగానూ అతనికి జంటగా రిత్విక హీరోయిన్‌గానూ నటిస్తోందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని దర్శకుడు తెలిపారు. అయితే అవకాశాలు తగ్గినా ఇంకా హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సదాను చూసి కొందరు కామెంట్ చేస్తున్నారు కూడా. ఎంత చేసినా ఈ వయసులో ఆమెకు బ్రేక్ రావడం కష్టమే అంటున్నారు. మరి సదాకు కోలీవుడ్ ‘టార్చ్ లైట్' ఎలాంటి దారి చూపిస్తుందో చూద్దాం.English summary
is playing in Torch Light, a film directed by Abdul Majid. The film is about the sex workers. After approaching a lot of actresses to play in the film, Abdul Majid gained success after narrating the story to Sadha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X