అయినా ఎలా ఆశపడ్డారు?: దేవయాని భర్తకు, సమంత నో చెప్పింది
చెన్నై : తెలుగు,తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోలతో వరసగా నటిస్తూ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్న హీరోయిన్ సమంత. ఈమె రీసెంట్ గా ఓ తమిళ చిత్రం అంగీకరించిందని, దాని దర్శకుడు విజయ్ మిల్టన్ అని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్రంలో మాజీ హీరోయిన్ దేవయాని భర్త రాజ్ కుమారన్ లీడ్ రోల్ చేయబోతున్నాడని అన్నారు.
అయితే అలాంటి ప్రాజెక్టు ఏమీ చెయ్యటం లేదని ఆమె ఖరారు చేసి చెప్పేసింది. తాన ప్రస్తుత దృష్టి మొత్తం మహేష్ తో చేస్తున్న బ్రహ్మోత్సవం పైనే ఉందని తేల్చి చెప్పింది. అలాంటి రూమర్స్ నమ్మవద్దని తన అభిమానులను కోరింది.

అయితే ఓ వర్గం మాత్రం మొదట విజయ్ మిల్టన్ దర్శకత్వంలో చిత్రం అంటే ఓకే చేసిందని, కథ వినటానికి ఆసక్తి చూపించిందని, అయితే సీన్ లోకి రాజ్ కుమారన్ రావటంతో నో చెప్పేసిందని అంటున్నారు.
గతంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ సరసన సమంత '10 ఎన్రదుకుళ్ల' అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తనకెప్పటికీ స్పెషల్ అని కూడా చెప్పింది సమంత. ఇప్పుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో సమంత నో చెప్పేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఎంత గొప్ప డైరక్టర్ పిలిస్తే మాత్రం ఇలా తన క్రేజ్ ని పణంగా పెట్టలేదు కదా సమంత ..ఏమంటారు. మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం' ట్రైలర్ (ఫోటోస్, వీడియో)


Click it and Unblock the Notifications











